సమాజంలో మనిషిని మనిషి గౌరవించుకోవడం ఎంత ముఖ్యమొ అలాగే ప్రాంతాల మధ్య భాషని యాసని జీవన విధానాన్ని సంస్కృతులని గౌరవించడం కూడా అంతే ముఖ్యం… ఒక భాష పట్ల యాస పట్ల చులకన భావంతోనో, రాజకీయ ప్రయొజనాల కోసమో తక్కువ చేయడం కానీ , హేళన చేయడం కాని జరిగితే అది తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది అనేది మనకి చరిత్ర చెబుతున్న సత్యం.
ఓక దశాబ్దం కిందట వరకు సీమాంద్ర ప్రాంతాంతో కలిసి ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం చూసాం .. వారిని పోరాటాం వైపు వెళ్ళాలా ఉదిగొలిపిన అనేక అంశాల్లో ముఖ్యమైన అంశం వారి ప్రాంతీయ మాండళికాన్ని ఆంధ్రప్రాంతానికి చెందిన కొందరు తక్కువ చేస్తూ హేళన చేస్తూ సినిమాల్లో చూపించడం నలుగురిలో ఉన్నప్పుడు హేళనగా మాట్లాడం. ఈ వివక్ష వారిలో ఆవేదన కలిగించిందనే మాట కాదనలేని సత్యం. ఫలితంగా తెలుగువారిగా ఒక్కటిగా ఉండే రాష్ట్రమే ముక్కలైనిది.
గత చేదు అనుభవాలని దృష్టిలో పెట్టుకునైనా ఒక ప్రాంత యాసని, భాషని, మాండలికాన్ని గౌరవించాల్సిన భాద్యత అందరిపై ఉన్నా , కోందరు మాత్రం స్వార్ధ రాజకీయ కారాణాలతో ఇప్పటికీ ప్రాంతాల మద్య విద్వేషాలు రగిలేలా వారి యాసని , జీవన విధాన్నాని కించపరుస్తూ మాట్లాడటం చూస్తూనే ఉన్నాం. ఇలా మాట్లాడుతున్న వారిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి , జనసేన పార్టీకి కొమ్ముకాసే వారే ఉండటం చూస్తే ఇది ఒక ప్రణాళికా బద్దంగా సాగుతున్న చర్యగానే కనిపిస్తుంది.
కేవలం ముఖ్యమంత్రి జగన్ గారు రాయలసీమలోని కడపజిల్లా వాసి కావడం , రాయలసీమ ప్రాంత ప్రజల్లో ఆయనకి ఏక్కువ ఆదరణ ఉండటంతో సహించలేని విపక్షాలు ఆయనపై వ్యక్తిగత దూషణలు చేయడంతో పాటు చివరికి ఆయన రాయలసీమ యాసని కూడా హేళన చేసే స్థాయికి దిగజారిపోయారు. ఇది కేవలం రాజకీయంగా ఒక పార్టీపై చేస్తున్న విమర్శ అనుకుంటూ విచక్షణ కోల్పోయి మోత్తం రాయలసీమ ప్రాంతాన్నే కించపరిచే స్థాయికి వెళ్ళిపోయారు. నిన్న మోన్నటి వరకు రాయలసీమ వారిని రౌడీలు , గూండాలు అన్నారు, వారికి తెల్లన్నం తినడం నేర్పింది మేమే అన్నారు, చివరికి నేడు ఏకంగా వారి యాసపై దాడి చేసే స్థాయికి వెళ్ళిపోయారు.
సీఎం జగన్ గారు తుఫాను భాదితులకి నిత్యావసర వస్తువుల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ. ‘బాధితులకు రేషన్ బియ్యం 25 కిలోలు, కందిపప్పు కిలో, పామాయిల్ లీటరు, ఒక కిలో ఆనియన్, ఒక కేజీ ఉల్లగడ్డ..’పొటాటో’ అంటే ఉల్లిగడ్డనే అంటారు కదా. .’ అని అనగానే అక్కడున్న అధికారులు, స్థానికులు ‘బంగాళాదుంప’ అంటూ గట్టిగా అరవడంతో ‘ఆ.. బంగాళాదుంప ఇచ్చాం’ అన్నారు. ఈ మాటని పట్టుకుని జగన్ గారికి బంగాళదుంపకి, ఉల్లిపాయకి కూడా తెలియదు అంటూ తెలుగుదేశం, జనసేన వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మోదలుపెట్టారు.
నిజానికి కోస్తాలో బంగాళదుంపగా పిలవబడే పోటాటోని రాయలసీమ ప్రాంతంలో ఉర్లగడ్డ, ఉల్లగడ్డ, ఉల్లిగడ్డ అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తారు. అలాగే కోస్తా ప్రాంతంలో ఉల్లిపాయగా పిలవబడే ఆనియన్ ని రాయలసీమ ప్రాంతంలో ఎర్రగడ్డలు అంటూ పిలుస్తారు. వీటితో పాటు అనేక కూరగాయలని కోస్తాలో ఒక విధంగా రాయలసీమ ప్రాంతంలో మరో విధంగా పిలుస్తారు. కానీ ఇవేమి పట్టనట్టు సీఎం జగన్ గారే ఏదో తప్పు చేసినట్టు సోషల్ మీడియాలో ఆయనపై దాడి చేయడం అంటే అది రాయసీమ ప్రాంత యాస మీద భాష మీద దాడి చేయడమే అవుతుంది.
ఇంకా దారుణమైన విషయం ఎంటంటే, ప్రాంతాల మధ్య మాండళిక భేదాల వలన తెలియక చేశారని అనుకున్నా, రాయలసీమ ప్రాంతం వారు తమ ప్రాంతంలో జగన్ గారు పిలిచినట్టే పిలుస్తాం అని వివరణ ఇస్తున్నా ఏకంగా నారా లోకేష్ ఆద్వర్యంలో నడిచే తెలుగుదేశం సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ ట్రోల్స్ పై వెనక్కి తగ్గకపోవడం చూస్తుంటే వీరు పనికట్టుకుని తెలిసినా ఆ ప్రాంత యాస మీద దాడి చేయటానికే ప్రణాళీకలు సిద్దం చేసుకున్నారని తెలుస్తుంది.
ఎప్పుడో 1969లో వచ్చిన ఒక చలనచిత్రంలో సీ నారాయణ రెడ్డి గారు రాసిన “తెలుగుజాతి మనది” పాటలో “ప్రాంతాలు వేరైనా అంతరంగం ఒకటే, యాసలు వేరైనా మన భాష తెలుగుభాష” అంటూ చక్కగా వివరించారు.. కానీ ఏళ్ళ తరువాత కూడా తెలంగాణ గాయం పచ్చిగానే ఉన్నా ఇంకా రాజకీయ లబ్ది కొసం ఒక వ్యక్తి పైన ఉన్న అకారణ ద్వేషం ఒక ప్రాంతపైకి మారడం చూస్తే వీరు రాజకీయాల్లో కోనసాగడమే రాష్ట్రానికి ప్రమాధంగా కనిపిస్తుంది.
కడప జిల్లా కలమళ్ళ గ్రామంలో, చెన్నకేశవ ఆలయంలో రేనాటి చోళరాజు దనుజయవర్మ వేయించిన శాశనం కలమళ్ళ శాశనం. ఇది తోలి తెలుగు శాశనం.. అలాంటిది కడప యాసకే వంకలు పెట్టి తెలుగు నెర్పిస్తున్నారా ఈ టీడీపీ, జనసేన వాళ్ళు ని సీమ ప్రజానికం ప్రశ్నిస్తుంది. అలాగే సీమ భాషను కించపరిచిన పార్టీలకి రాజకీయ సమాధి కడతాం అంటూ రాయలసీమ భాషా పరిరక్షణ సమితి హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికైనా రాజకీయాల ముసుగులో ప్రాంతాల మద్య విద్వేషాలు రగల్చకుండా, సున్నితమైన అంశాలని రాజకీయాల్లోకి లాగకుండా యాసలని భాషలని గౌరవించుకుంటూ ప్రవర్తించేలా టీడీపీ, జనసేన అధినాయకత్వం వారి పార్టీ శ్రేణులకి హితబోద చేస్తుందో లేదో చూడాలి.