400 సెల్టవర్స్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు . మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా కమ్యూనికేషన్ నెలకొల్పే సదుద్దేశంతో ఈ సెల్టవర్స్ను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ఏడాది జూన్ నెలలో 100 సెల్టవర్స్ను ప్రారంభించామని, తద్వారా 42000 మందికి మేలు చేకూర్చమని జగన్ తెలిపారు. నేడు వర్చువల్ గా ప్రారంభిస్తున్న 400 సెల్టవర్స్ వల్ల కనెక్టివిటీ లేని గిరిజన ప్రాంతాలోని దాదాపు 2,00,000 మేలు చేకూరనుందని సీఎం జగన్ వెల్లడించారు. సుమారు 400 కోట్ల పెట్టుబడితో ఈ టవర్లను ఏర్పాటు చేశామని ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలను పారదర్శకంగా తీసుకెళ్లేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్ (ఐటీశాఖ) డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారతీ ఎయిర్టెల్, రిలయెన్స్ సంస్ధల ప్రతినిధులు హాజరయ్యారు.