సీఎం జగన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా ఒంగోలు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేదలను చూసి చలించిపోయారు. అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. హెలిప్యాడ్ నుంచి సభా స్థలికి ముఖ్యమంత్రి వెళుతున్న సమయంలో తన సహాయార్ధం వచ్చిన వారితో ప్రత్యేకంగా మాట్లాడి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని, అన్ని విధాల ఆదుకుంటానని వారిలో ధైర్యం నింపి బాధితులకు అవసరమైన ఆర్థిక, ఇతర సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ను అప్పటికప్పుడే సీఎం జగన్ ఆదేశించారు. దీంతో 12 మందికి శనివారం మొత్తం రూ.13 లక్షల విలువైన బ్యాంకు చెక్కులను జిల్లా కలెక్టర్ అందించారు.
సహాయం పొందుకున్న వారి వివరాలు
1. బేస్తవారిపేట మండలం చినఓబినేనిపల్లెకు చెందిన పి.మరియమ్మ భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆర్ధికంగా చితికిపోయామని చెప్పడంతో ఆమెకు ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు.
2. బేస్తవారిపేట మండలం చినఓబినేనిపల్లె గ్రామానికి చెందిన కొమ్ము వెంకట లక్ష్మి భర్త కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలుసుకున్న సీఎం జగన్, ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ ద్వారా అందించారు.
3. ఒంగోలు ఏకలవ్య నగర్ కు చెందిన జగన్నాధం మాధురి నెలలో రెండుమూడు సార్లు రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు.
4. ఒంగోలు మండల యరజర్ల గ్రామానికి చెందిన బంకా సురేష్ పుట్టుకతోనే వికలాంగుడు కావడంతో అతని జీవనోపాధి కోసం ప్రభుత్వం తరపున లక్ష రూపాయల చెక్కును అందించారు.
5. ఒంగోలు సమతానగర్లో నివాసం ఉంటున్న వెంకటేశ్వరం గోవిందు కుమారై పక్షవాతంతో బాధపడుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు.
6. నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామానికి చెందిన షేక్ అనీల్ భాష పెద్ద కుమారై ఆయేషా (16)కు జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వస్తున్నాయని ముఖ్యమంత్రికి తెలపడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రభుత్వం తరపున రెండు లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు.
7. ఒంగోలు ఎన్టీఆర్ కాలనీకి చెందిన చిలకా చిన్నక్క కుమారుడు చిలకా ప్రవీణ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, వైద్య ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత తమ కుటుంబానికి లేదని ముఖ్యమంత్రికి తెలపడంతో ప్రభుత్వం తరపున లక్ష రూపాయల చెక్కును అందించారు.
8. టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామానికి చెందిన మాబు సాహెబ్ భార్య షేక్ ఖాసీంబీకి వెన్నెముక ఆపరేషన్ జరగడంతో పాటు తనకు కూడా గుండె ఆపరేషన్ జరిగిందని, ఆర్థికంగా చితికిపోయిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరడంతో ప్రభుత్వం తరపున యాభై వేల రూపాయల చెక్కును అందజేశారు.
9. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరుకు చెందిన వాణి కుమారునికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిందని ఆర్థికంగా చితికిపోయిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరడంతో ప్రభుత్వం తరపున లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు.
10. పెద్దారవీడు మండలంలోని అదే గ్రామానికి చెందిన వేశపోగు చిన కాశయ్య గుండె సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్న కారణంగా ప్రభుత్వం తరపున యాభై వేల రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు.
11. తాళ్లూరు మండలం మాధవవరం గ్రామానికి చెందిన కొడిమెల వెంకట్రావు ఇద్దరు కుమారులు వెన్నెముక కండరాల క్షీణత (ఎస్.ఎం.ఏ) వ్యాధితో బాధపడుతున్నారని, ఖరీదైన మందులను కొనుగోలు చేసే శక్తి లేదని ముఖ్యమంత్రి జగన్ కు తెలపడంతో ప్రభుత్వం తరపున రెండు లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు.
12. టంగుటూరుకు చెందిన చుండు హృదయరాజు – ఉషారాణి దంపతుల కుమారుడు కీర్తన్ కుమార్ (7) అరుదైన కవాసకీ వ్యాధి(చర్మం పగిలిపోయి ఊడిపోవడం) తో బాధపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు.