సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
కాగా ఆడుదాం ఆంధ్ర పోటీలకు దాదాపుగా రూ.120 కోట్లు జగన్ ప్రభుత్వం వెచ్చిస్తుండగా డిసెంబర్ 26న ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్లుగా అంబటి రాయుడు, కరణం మల్లేశ్వరి, కోన శ్రీకర్ భరత్, రావి కల్పన, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, వి.జ్యోతి సురేఖ, సాత్విక్, సాకేత్ మైనేని, చేతన్ ఆనంద్, కోనేరు హంపి, ఇ.రజనిలు వ్యవహరించనున్నారు. ఆడుదాం ఆంధ్రకు కర్టెన్ రైజర్‌గా ఎమ్మెల్యేలకు ప్రభుత్వం పోటీలు నిర్వహించనుంది.