జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మునుపెన్నడూ ప్రభుత్వ అధీనంలో జరగని క్రీడా పోటీలు మొదటి సారిగా ఈ ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు టాలెంట్ ను వెలికి తియ్యడానికి ప్రభుత్వం మొదటి సారి పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించనుంది . ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు విశాఖ వేదిక అయ్యింది.
మొదట గ్రామీణ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించారు వీరిలో విజేతలుగా నిలిచిన వారు మండల స్థాయిలో, మండల స్థాయిలో గెలిచిన వారు నియోజక వర్గ స్థాయిలో, నియోజక వర్గ స్థాయిలో గెలిచిన వారు జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయిలో గెలిచిన వారు రాష్ట్ర స్థాయిలో ఆడుతారు. ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో పోటీలు దిగ్విజయంగా పూర్తి అయ్యాయి. నేటి నుంచి రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్ర పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలను ఐపీఎల్ ఫ్రాంచైజ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్ ద్వారా బాగా ఆడిన ప్లేయర్స్ ను సెలెక్ట్ చేసి వారికి శిక్షణ కల్పిస్తారు.
గ్రామీణ స్థాయిలో ఆటగాళ్ళకు ఈ స్థాయిలో అవకాశం అంటే మంచిదే అని చెప్పవచ్చు. కాగా ఆడుదాం ఆంధ్రలో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, కోకో, బ్యాడ్మింటన్ ఇలా అన్నిటిలో పోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో గెలిచిన జట్లుకు 5 లక్షలు బహుమానం ఇవ్వనున్నారు. పురుషుల క్రికెట్ ఫైనల్స్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా వీక్షించి గెలిచిన జట్టుకు బహుమతులు ఇస్తారు అని క్రీడాశాఖ మంత్రి రోజా ఒక ప్రకటనలో తెలిపారు.