ఎన్నికలు సమీపిస్తున్నా కూటమి పొత్తులు ఒక కొలిక్కి రాలేదు. ముఖ్యంగా అనపర్తి, ఏలూరు ఎంపీ, దెందులూరు, నర్సాపురం చుట్టు తిరుగుతుంది. నర్సాపురం ఎంపీ బదులు ఏలూరు ఎంపీ ఇస్తాము అని టీడీపీ పెట్టిన ప్రపోజల్ ను బిజెపి కేంద్ర నాయకత్వం తోసిపుచ్చింది. అంతే కాకుండా నిన్ననే నర్సాపురం ఎంపీ అభ్యర్థి వర్మకు పార్టీ తరపున బీఫారంను అందించి క్లియర్ కట్ గా ఇంకో ఆలోచన లేకుండా చేశారు. దీని తరువాత మరో అసెంబ్లీ స్థానం అనపర్తి పై అందరి చూపు పడింది.దీనికి బిజెపి నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబుతో ఒక ప్రపోజల్ పెట్టారు. అనపర్తి టికెట్ బిజెపికి ఇస్తే దెందులూరు టికెట్ ఇవ్వాలని కండిషన్ పెట్టారు.
ఇక్కడ బిజెపి నుండి తపన చౌదరి గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గం అంతా తిరుగుతూ పనిచేశారు , మరో వైపు ఏలూరు ఎంపీ పరిధిలో బిజెపి తరుపున కష్టపడి పనిచేసి టికెట్ ఆశించిన గారపాటి చౌదరి కి కూడా ఎక్కడో ఒకచోట టికెట్ ఇవ్వాలని దెందులూరు సీటును బిజెపి అగ్రనాయకులు టీడీపీని అడిగారు అయితే దెందులూరు లో ఈ విషయమై చింతమనేని ప్రభాకర్ ను సంప్రదించగా అసలు వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు దీనితో చేసేది ఏమీ లేక చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి చెందిన చింతమనేనికి అండగా నిలబడుతూ బిజెపినే అనపర్తిలో పోటి చెయ్యమని సూచించి అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణ రెడ్డికి వెన్నుపోటు కు చంద్రబాబు సిధ్ధం అయ్యారు.
మరోవైపు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి టీడీపీ టిక్కెట్ ఇచ్చి మోసం చేశారు అని తన కుటుంబంతో కలిసి నియోజకవర్గం మొత్తం తిరుగుతూన్నారు. ఇందులో వృద్ధురాలైన తన తల్లిని కూడా ఎండలో తిప్పుతున్నారు. చంద్రబాబు ఇంకా న్యాయం చేస్తారు అని నమ్మకం వుంది లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వుంటాను అని తెలిపారు. కానీ చంద్రబాబు దెందులూరు చింతమనేని చౌదరి కోసం అనపర్తి రెడ్డిని గాలికి వదిలేశారు. తన ఓటు తన సొంత సామాజిక వర్గ నాయకుడుకే వేశారు.
ఇప్పుడు అనపర్తి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి భవిష్యత్ ఏమిటో అర్ధం కాని పరిస్థితుల్లో నిలబడ్డారు.