బాపట్ల జిల్లా ఇంకొల్లులో శనివారం టీడీపీ నిర్వహించిన సభలో చంద్రబాబు కరణం బాలరాం పై పలు ఆరోపణలు చేసిన విషయం విదితమే . దానికి సమాధానంగా నిన్న ఆదివారం తన ఇంటిలో మీడియా సమావేశం నిర్వహించి చాలా ఘాటుగా సమాధానం ఇవ్వటంతో పాటు, టీడీపీలో పరిటాల, కోడెల వంటి నాయకుల కష్ట కాలం వచ్చినప్పుడు చంద్రబాబు అండగా నిలవకపోగా కనీసం ఫోన్ కాల్స్ కూడా ఎత్తలేదని ఇవే విషయాలు తనతో చెప్పుకొని బాధ పడ్డాడు అంటూ సంచలన విషయాలు బయట పెట్టారు.
అంతే కాదు 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు చేసిన కొన్ని అనైతిక చర్యల గురించి మాట్లాడుతూ నాడు ప్రకాశం జిల్లాలోని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించటానికి బాబు వద్ద నుండి డబ్బులు తీసుకోని ఆ ఎమ్మెల్యేలకు అందించిన వారెవరో ఇచ్చిన మొత్తం ఎంతో తనకు మొత్తం తెలుసని చంద్రబాబుకి దమ్ముంటే ఈ విషయం పై చర్చకు రావాలని, నన్ను రమ్మన్నా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తానని సవాల్ చేశారు కరణం .
నిజానికి 2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు అక్రమంగా లాక్కున్నప్పుడు ఇంటిలిజెన్స్ ద్వారా బెదిరించి, మంత్రి పదవులు ఆశ చూపి, డబ్బు ఇచ్చి ఫిరాయింపులు ప్రోత్సాహించాడు అనేది జగమెరిగిన సత్యం . ఇంకొందరు ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపినా పార్టీ ఫిరాయించకుండా ప్రలోభపెట్టిన విషయాన్ని బహిర్గటం చేసి బాబుని ఎండగట్టారు.
కానీ గోడ దూకిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టింది ఎవరు, ఎవరికి ఎంత ఇచ్చాడు అనేది ఇన్నాళ్ళూ రహస్యంగానే మిగిలిపోయింది. ఇప్పుడు కరణం వ్యాఖ్యలతో ఆ రహస్యాలు కరణం బలరాంకి తెలిసినా, నేడు తాను టీడీపీని వీడి మరో పార్టీలో ఉన్నా కానీ నైతిక విలువలకు కట్టుబడి ఇన్నాళ్ళూ మౌనం వహించాడు అనేది అర్ధమవుతుంది. అలాంటి కరణం బాలరాంని కెలుక్కొని అసత్య ఆరోపణలు చేసి కోపం తెప్పించాడు చంద్రబాబు.
సహనం కోల్పోయిన కరణం నాటి బాబు కుట్రల గురించి చూచాయగా ప్రస్తావించి మరోసారి నా జోలి వస్తే మొత్తం బయట పెడతానని అన్యాపదేశంగా హెచ్చరించాడు అనుకోవచ్చు.
బాబు మరోసారి కరణం పై ఏదొక విమర్శలు చేయకపోడు, ఆ రోజు కరణానికి కోపం రాకపోదు, అప్పుడు నిజానిజాలు అన్నీ తన్నుకొంటూ వస్తాయి . ఆ రోజు కోసం ఎదురు చూద్దాం