రాష్ట్ర ప్రజలందరిలో సామాజికంగా అభివృద్ధి జరిగినప్పుడే సమాజంలో సోషల్ జస్టిస్ జరుగుతుందని నమ్మి ఆ దిశగా అడుగులువేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గడిచిన 56 నెలల పరిపాలనా కాలంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సామాజిక రంగ అభివృద్దికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల భవిష్యత్తును మార్చే కార్యక్రమంలో భాగంగా గత నాలుగేళ్ళుగా సామాజిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యయం పెంచుతూ వచ్చింది. ఈ విషయం కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) అకౌం ట్స్ నివేదిక-2022-23 లో తేటతెల్లమయింది.
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. సామాజిక రంగం వ్యయాన్ని ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ పెంచుతూ వచ్చింది
2019-20 సంవత్సరంలో రూ. 70,157 కోట్లు గానూ..
2020-21 సంవత్సరంలో రూ. 71,194 కోట్లు గానూ..
2021-22 సంవత్సరంలో రూ. 75,610 కోట్లు గానూ..
2022-23 సంవత్సరంలో రూ. 89,096 కోట్లు గానూ..
మొత్తంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్ళలలో సామాజిక రంగానికి రూ. 3,06,057 కోట్లు వెచ్చించినట్లు కాగ్ నివేదికలో తెలిపింది. విద్య, వైద్య ఆరోగ్య– కుటుంబ సంక్షేమం, తాగునీరు, పారిశుధ్యం, గృహనిర్మాణం, పట్టణాభివృద్ది, కార్మిక ఉపాధి, సంక్షేమం, సామాజిక భద్రతలను సామాజిక రంగంగా పరిగణిస్తారు. విద్య, వైద్య రంగాలకు, పౌష్టికాహా రానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుం డటంతో ఆ రంగాలపై ఎక్కువ ఖర్చు చేసినట్టు కాగ్ అకౌంట్స్ నివేదికలో తెలిపింది.