సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి నచ్చదు. చాలా సమావేశాల్లో వారి గురించి అభ్యంతరకరంగా మాట్లాడారు. గోనె సంచులు మోసుకునే ఉద్యోమంటూ వెక్కిరించారు. పురుషులు ఇంట్లో లేనప్పుడు వెళ్లి ఇళ్ల తలుపులు కొడుతున్నారని నీచంగా అన్నారు. అలాగే ఎల్లో మీడియా సైతం వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ సోషల్ మీడియా వారిని చూపు చూస్తూ మీమ్స్ చేసింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉన్న వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. వారు ఆందోళన చేయడంతో దిగొచ్చి మాట మార్చారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించే ఈ వ్యవస్థ చాలా గొప్పదని అనేక రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా వలంటీర్ల నియామకం చేయాలని ఆలోచన చేస్తోందని వార్తలొచ్చాయి. అంతెందుకు చంద్రబాబు కూడా 30 ఇళ్లకు ఒకరిని నియమిస్తామన్నారు. కాకపోతే ప్రస్తుత ప్రభుత్వంలో జనానికి మంచిన చేస్తున్న వారు ఆయనకు నచ్చలేదంతే.
మంగళవారం చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో జరిగిన ‘రా.. కదలిరా’ సభలో బాబు పాల్గొని మాట్లాడారు. వలంటీర్లపై తన అక్కసును మరోసారి బయటపెట్టారు. స్వరం పెంచి జగన్ను నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని.. తామే అధికారంలోకి వస్తామని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వలంటీర్లు ప్రభుత్వంలో భాగం. రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని గద్దించారు. ఓ వైపు బెదిరిస్తూనే మరోవైపు మంచి చేసుకునేందుకు బాబు ప్రయత్నించారు. ప్రజలకు సేవ చేస్తే మేము వ్యతిరేకం కాదని, మంచి పనులు చేసేవారికి సహకరిస్తామంటూ మోసపూరిత మాటలు చెప్పారు. ఐదేళ్లపాటు తెలుగు తమ్ముళ్లతో కూడిన జన్మభూమి కమిటీలను నడిపిన చంద్రబాబుకు వలంటీర్లు చేసిన మంచి గురించి ఏమి తెలుస్తుంది. ఆయన కమిటీలు అరాచకాలు చేస్తే ఇప్పటి వలంటీర్లు ప్రతినెలా ఒకటో తేదీన పేదల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. కరోనా సమయంలో వీరు చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరు. ప్రాణాలకు తెగించి తమ పరిధిలోని 50 ఇళ్లకు అండగా నిలిచారు. ప్రతి పథకం వారి ద్వారానే అర్హులకు అందుతోంది. ఇంత చేస్తున్న వారి పట్ల ప్రజలకు ప్రేమ ఉంటుంది తప్ప ద్వేషం ఉండదు బాబూ..