నీటిని ఒడిసిపట్టేందుకు వైయస్ జగన్ విప్లవాత్మకంగా పూర్తి చేసిన వెలిగొండ ప్రాజెక్ట్ ను నిన్న జాతికి అంకితమిచ్చారు. సాధారణంగానే ఏదైనా మంచి జరిగినపుడు వాస్తవాలను వక్రీకరించి రాసే ఈనాడు దీనిపై కాకమ్మ కథలు వండి వడ్డిస్తుంది.
వాస్తవానికి వెలిగొండ మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి సీయం జగన్ పూర్తిచేయించగా, రెండో టన్నెల్ ను 2024 జనవరి 21 నాటికి పూర్తిచేయించారు. YS పాలనలో 20.33 కిలో మీటర్లు, బాబు పాలనలో 6.68 కిలో మీటర్లు
జగన్ పాలనలో కరోనా వల్ల పనులకు ఆటంకాలు ఎదురయ్యినప్పటికీ 10.56 కిలో మీటర్లు వరసగా తవ్వించారు. అంటే YS మరియు జగన్ కలిసి 31 కిలో మీటర్లు టన్నెల్ పనులు పూరి చేస్తే బాబు పూర్తి చేసింది కేవలం 6.6 కిలో మీటర్లు మాత్రమే
ఇక వెలిగొండ వ్యయానికి వస్తే, 2004–14 మధ్య వైఎస్ హయాంలో వ్యయం- రూ.3,610 కోట్లు ఖర్చు చేయగా, 2014–19 మధ్య బాబు హయాంలో వ్యయం – రూ.1,386 కోట్లు ఖర్చు చేసారు. ఇందులో కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.631 కోట్లను దోచిపెట్టారు అని కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది.అంటే నిజంగా ఖర్చు పెట్టింది 755 కోట్లు మాత్రమే.
రెండేళ్ళ కరోనా కాలాన్ని తీసేస్తే జగన్ 3 ఏళ్లలో చేసిన వ్యయం- రూ.978 కోట్లు. రౄండు టన్నెల్సునూ పూరి చేసి నిన్న జాతికి అంకితం చేయడం తో ఎక్కడ మంచి పేరు వస్తుందో అని కడుపు మంటతో తెల్లారేసరికి ఈనాడు రోత రాతలతో ఇంటింటి ముందు సిధ్ధమయిపోయింది.