2014 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల హామీలు అమలు చేయలేదని ముఖ్యంగా మహిళలకి ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ, బంగారు నగల తాకట్టు రుణ మాఫీ, పుట్టిన పిల్లకి 25 వేలు డిపాజిట్ చేసే మహాలక్ష్మి పధకం, ప్రతి మహిళకు స్మార్ట్ ఫోన్ లాంటి హామీలు అమలు చేయలేదని ఇప్పటికీ తిడుతుంటారు పలువురు మహిళలు .
అయితే మహిళల పట్ల చంద్రబాబు గారికి ఉన్న గౌరవం, వారి సమస్యల పట్ల లోతైన అవగాహన, అవి తీర్చటం పట్ల ఆయనకి ఉన్న చిత్తశుద్ధి గురించి బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలీక పోవటం దురదృష్టం . అలాంటివి ప్రపంచానికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మహిళల సమస్యలు తీర్చటం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని ప్రపంచానికి తెలియజేసే మహత్తర సాక్ష్యం ఒకటి మీకు అందిస్తుంది కోస్తా టీం.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళలకు కాన్పు వస్తే పడే కష్టాలు బాబు గారికి బాగా తెలుసు . అందుకే తాను అధికారంలో ఉన్నప్పుడు 19-02-2019 నాడు గర్భిణీలైన ప్రభుత్వ ఉద్యోగులకోసం ఒక జీవో తీసుకొచ్చారు బాబుగారు, go ms 26 నెంబర్ . జీవో సారాంశం ఏమనగా 25-11-1993 ముందు ఉద్యోగంలో చేరిన nmr లకు అనగా తాత్కాలిక ఉద్యోగస్తులకు కూడా పెర్మినెంట్ ఉద్యోగస్తుల లాగే పూర్తి జీతంతో ఆరు నెలలు అనగా 180 రోజులు “మెటర్నిటీ లీవ్ అనగా గర్భిణీ అయితే కాన్పు సెలవులు” ప్రకటించారు దయాళువు బాబు గారు .
1993 ముందు ఉద్యోగంలో జేరిన వారికి అప్పటికి 25 ఏళ్ళు ఉంటాయి . బాబు గారు జీవో ఇచ్చిన 2019 నాటికి మరో 27 కలిసి 52 ఏళ్ళు వచ్చి ఉంటాయి . అంటే మెనోపాజ్ ఏజ్ లో కూడా కష్టపడి పిల్లల్ని కనమని మెటర్నిటి లీవ్ ఇచ్చిన బాబు గారి ఔదార్యం ఈ కాలం వారికి తెలియకపోవటం దురదృష్టకరం . సరే ఆరు నెలలు సెలవు వస్తుంది అని ఆ మహిళలు ఆశ పడొచ్చు . కానీ వారి భర్తల వయస్సు ఆరోగ్య స్థితులు సహకరిస్తాయో లేదో పాపం .