జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనను తాను అతిగా ఊహించుకుంటుంటారు. బహుశా కొందరు పిచ్చి అభిమానులు ఉండడంతో అలా ప్రవర్తిస్తుంటారేమో.. ప్రజలకు వినోదం అందించాల్సిన సినిమా ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడాలని తీవ్రంగా ప్రయత్నించి విఫలమవడం ఆయనకు అలవాటు అయిపోయింది. గత సినిమాల్లో ఎన్నో డైలాగ్‌లు చెప్పారు. కానీ ప్రతిసారి అవి బూమరాంగ్ అయ్యాయి. తాజాగా పవన్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే మూవీ రూపొందుతోంది. అందరూ ఎన్నికల హడావుడిలో ఉంటే సేనాని మాత్రం సీరియస్‌నెస్ లేకుండా ఈ సినిమాపై పడ్డారు. భగత్స్ బ్లేజ్ అంటూ చిత్ర బృందం పొలిటికల్ డైలాగ్స్‌తో కూడిన వీడియోను రిలీజ్ చేసింది. దీనికి ఇటీవలే హీరో వారు డబ్బింగ్ చెప్పారు.
ఎప్పటిలాగే పవన్ తన అభిమానులను, జనసైనికులను అలరించేందుకు ఇందులో తన పార్టీపైన డైలాగ్‌లు వదిలారు. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది.. గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అంటూ చెప్పుకొచ్చారు. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అలా సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. పార్టీ పెట్టిన నాటి నుంచి సేనాని చంద్రబాబు నాయుడి సేవలో ఉన్న విషయం జగమెరిగిన సత్యం. దీంతో గ్లాసు సైన్యానికి అధ్యక్షుడు బాబేనని పోస్టులు పెడుతున్నారు. ‘సైన్యం ఉంటే ధైర్యంగా యుద్ధం చేయొచ్చు కదా.. భయపడి వేరే వాళ్లతో పొత్తు పెట్టుకోవడం ఎందుకు..’, ‘ఇక్కడ గాజు పూర్తిగా పగిలిపోయి ఎప్పుడో పొడి అయిపోయింది’, ‘గాజు గ్లాస్‌కే మన ఓటు.. కానీ ఎమ్మెల్యే మాత్రం వర్మనే..’, ‘గ్లాసు పగిలేకొద్దీ పదునెక్కుతాదట. పగిలిన గ్లాస్లో ఎవడ్రా టీ తాగేది’, ‘గ్లాస్ అంటే సైజ్ కాదు.. బాబు గారు ఇచ్చే ప్యాకేజీ ప్రైజ్..’ ఇలా భగత్స్ బ్లేజ్పై సెటైర్లు ఓ రేంజ్లో పేలుతున్నాయి. అందుకే సినిమాల్లోకి రాజకీయాలను తీసుకెళ్లకూడదు. రాజకీయాల్లోకి సినిమాలను తీసుకురాకూడదు. కానీ సేనాని తిక్కకు లెక్క ఉండదు కదా..