నడిచినంత సేపూ చంద్రబాబు చాణక్యం అని పచ్చ మీడియా ఊదరగొడుతుంది కానీ, సదరు చంద్రబాబు చాణక్య రాజకీయాలకు బలయిపోయినోళ్ళ వివరాలను మాత్రం బయటకు రానీయదు. వైసీపీ లో ఉన్న కొలుసు పార్ధసారధికి పెనమలూరు టికెట్ ఇస్తానని ఆశ చూపించి, టీడీపీలో చేరేలా చేసి జగన్‌ని బండబూతులు తిట్టించారు.
తీరా ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు నీకు పెనమలూరు టికెట్ ఇవ్వను, నూజివీడు టికెట్ ఇస్తాను తీసుకుంటే తీసుకో లేకపోతే పో అనేశారు. నోరెళ్ళబెట్టిన పార్ధసారధి అప్పటికే వైసీపీ మీద నోరు జారి ఉండటంతో కిమ్మనకుండా, చేసేదేమీ లేక నూజివీడు టిక్కెట్ తీసుకొని గమ్మున ఉన్నాడు.
ఇప్పుడు అదే రీతిలో గురజాల టికెట్ ఇస్తానని జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టించి ఇప్పుడు గురజాల టికెట్ ఇచ్చేది లేదని కరాకండిగా చెప్పడంతో… నిన్న పల్నాడు వేదికగా టిడిపి పార్టీలో చేరవలసిన జంగా చేరకుండా ఆగిపోయాడు. రెంటికీ చెడ్డ రేవడి అయ్యాడు. జగన్‌ను తిట్టడంతో ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళలేరు, పైగా చచ్చినట్టు టిక్కెట్ ఉన్నా, లేకున్నా తెలుగుదేశం పార్టీలో పని చేయక తప్పదు. అది మరి చంద్రబాబు నాయుడు చాణక్య రాజకీయం.
మహాసేన రాజేష్ సీటు వెనక్కి తీసుకోవడంతో పాపం ఎప్పుడూ లేనట్టుగా తెలుగు తమ్ముళ్ళందరూ దళిత ప్రేమ పాఠాలను సోషల్ మీడియాలో చదువుతున్నారు. గతంలో వాళ్ళ అధినేతే యస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని అన్ని విషయాన్ని చాలా సులభంగా మరిచిపోయారు. అప్పటి ఎంపీ శివప్రసాద్ కుమార్తె డాక్టర్ మాధవీలతకూ బాబు తాలూకా దళిత రాజకీయం దెబ్బ పడింది. బాబు అధికారంలో ఉండగా, తన డ్రైవర్‌పై అధికార పార్టీ వాళ్ళు చేయి చేసుకున్నారని మాధవీలత రోడ్డుపై బైఠాయించి నిరసన చేసినా, నాలుగు గంటలయినా కూడా పట్టించుకోకుండా అలానే వదిలిపెట్టారు. ఇప్పుడు టికెట్ ఆశ చూపి మహాసేన రాజేష్‌ని జగన్ మీదకి వదిలాడు. పవన్ వారాహి ఎక్కి మంచి ఊపు మీద ఉన్నప్పుడు పవన్‌ని తిట్టించాడు. చిన్నపాటి నిరసన రాగానే అబ్బెబ్బే అంటూ మహాసేన రాజేష్ టికెట్ వెనక్కి తీసేసుకున్నాడు.
సీట్లు ప్రకటిస్తే బీజేపీ కంగారుతో పొత్తు కి వచ్చేస్తుందని లెక్కేసి, కొన్ని స్థానాలను పెండింగ్‌లో పెట్టి లిస్టును వదిలారు. అది చూసి కస్సుమన్న బీజేపి ఇపుడు పొత్తు లేదంటుంది. ఒకవేళ పొత్తు కుదిరితే… బీజేపీ నేతపై చెప్పు విసిరిన కొలికిపూడి కి కూడా బాబు కావాలనుకుంటే మొండి చేయి చూపగలడు. బాబుని నమ్ముకుని రుబాబు చేస్తే బతుకు బస్టాండే అనడానికి ఇవే ఉదాహరణలు.