ఎన్టీఆర్ ని గౌరవంగా సాగనంపిన ఏడాది తర్వాత రాష్ట్ర స్థితిగతుల పై దృష్టి సారించిన చంద్రబాబు 1996లో రాష్ట్ర విద్యాధికారుల సమావేశం ఏర్పాటు చేసి విద్యలో రాష్ట్రం వెనుకబడిపోయిందని, విద్యా వ్యవస్థను బాగుచేసేందుకు 30 రోజుల్లో 30 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇది విని నిరుద్యోగులు పొంగిపోయారు.
అయితే అప్పటికే టీచర్ పోస్టుల భర్తీ కేసు ఒకటి సుప్రీంకోర్టులో నడుస్తుంది. 1989 లో ఉపాద్యాయుల భర్తీకి రాష్ట్రం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా అప్పట్లో క్వాలిఫైడ్ టీచర్లు ట్రిబ్యునల్ కు వెళ్ళడంతో అది చివరకు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. చంద్రబాబు నిరుద్యోగులకు టీచర్ పోస్టుల భర్తీపై మాటిచ్చేటప్పటికే నాలుగేళ్ళుగా రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ సాధ్యం కాలేదు. అయితే ఆ విషయమంతా ముందే తెలిసి కూడా.. ఆ కోర్టు కేసులపై అవగాహన ఉండి కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామంటూ చెప్పడం వెనుకున్న మతలబు ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు.
1989లో అభ్యర్ధులు వేసిన కేసును 1994 జూలై 21 న ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వారి పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.1994, జూలై 28 న నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆగస్టు 21, 28 తేదీల్లో ఎంపికకు సంబంధించి రాతపరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 10 నుండి 30 మధ్యలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారి జాబితాను జిల్లాల్లో ప్రకటించారు.. అయితే మళ్ళీ 1994, సెప్టెంబర్ 12 న పలువురు అభ్యర్ధులు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. జీఓఎంఎస్ నం.221 ప్రకారం పరీక్షల నిర్వహణ చట్ట వ్యతిరేకమని వాదించారు. ముందు ట్రిబ్యునల్ పరీక్షల ఫలితాలను ప్రకటించవద్దని ఆదేశించినప్పటికీ, తరువాత ఫలితాలు అసలు వెల్లిడించవద్దని స్పష్టం చేసింది. ఈ కేసు ట్రిబ్యునల్ పరిధిలోకి రాదని రాష్ట్ర ప్రభుత్వం వాధించింది. అయినా ఈ కేసు కోర్టులో తేలిన తరువాతనే నియామకాలకు సులభమవుతుందని అప్పటి ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం 1996 ఏడాది జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎంపిక జరుగుతుందని స్పష్టం చేసింది. అప్పటి ఆ నోటిఫికేషన్ ప్రకారమే జూలై లో 30 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అటువంటప్పుడు కోర్టు తీర్పు రాకుండా ఆగస్టు నెలా ఖరులోగా ఎంపిక ఏవిధంగా సాధ్యమవుతుందని చంద్రబాబు నిరుద్యోగులకు మాట ఇచ్చారన్నది అప్పట్లో పెద్ద ప్రశ్నగా మారింది. క్వాలిఫైడ్ టీచర్లను తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. కానీ కొన్ని జిల్లాల్లో అసలు క్వాలిఫైడ్ టీచర్ల సమస్యలేదు. దీనిని బట్టి చంద్రబాబు ప్రభుత్వం రాత పరీక్షల ఫలితాల ఆధారంగా మౌకిక పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడి చేయకుండా ఫైళ్ళకే మాత్రమే పరిమితం చేసేందుకు నిరుద్యోగులతో ఈ దాగుడుమాతల ఆట ఆడినట్టు తేటతెల్లమయ్యింది.
ఒకవేళ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే.. పరీక్షా విధానాన్ని మార్చాలని ఆదేశిస్తే అప్పటివరకూ నిర్వహించిన వ్యవహారాన్నంతా బుట్టలో వేయాల్సి వచ్చేది.. ఇవన్నీ ముందే తెలిసినా చంద్రబాబు మాత్రం నిరుద్యోగుల మనసుల్లో లేనిపోని ఆశలు రేకెత్తేలా తప్పుడు హామీలు ఇచ్చాడు.
ముంధైతే నోటికొచ్చిన హామీ ఇచ్చేద్ధాం.. తరువాతి సంగతి తరువాత చూద్ధామనుకునే చంద్రబాబు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నిరుద్యోగులకు మంచి చేసిన పాపాన పోలేదు.
ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడం, నిరుద్యోగులకు గాల్లో నుండి ఉద్యోగాల సృష్టించడం లాంటివి బాబుకే సాధ్యం . బాబు మాటల్లో ఇంటింటికి ఉద్యోగాలు, అనుకూల మీడియాలో లక్షల ఉద్యోగాలు కనపడినా.. వాటికి సంబంధించి నోటిఫికేషన్స్ రావు.. వచ్చినా నియామకాలు జరగవు. అది చంద్రబాబు ఉద్యోగాల కల్పనా విధానం.. మొదటి నుండి ఇదే విధానం