ఎన్నికలు వస్తే చాలు బాబు ఇచ్చే హామీలకి అడ్డూ అదుపు ఉండవు అవసరం అయితే నాకు ఓటేస్తే చంద్రమండలం మీద అందరికీ ప్లాట్ లు ఇస్తా అని కూడా హామీ ఇస్తాడు, ఎలాగూ నెరవేర్చేవి కాదు, గెలవగానే మర్చిపోయేదే కదా అని..
అందులో భాగం గానే 1996 లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు బాబు ఇచ్చిన హామీలలో ఇదొకటి.. త్వరలో మహిళలందరికీ భూమి పంచుతాం అని, అప్పుడే భూమి ఇచ్చేసినట్లుగా ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన భూమి పై భూస్వాములు కన్నేస్తే ఊరుకోను అని డాబుసరి మాటలు కూడా మాట్లాడేసాడు…
వాస్తవానికి వస్తే 1971 లో చేసిన భూ గరిష్ట పరిమితి చట్టం వలన 1995 నాటికి రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఎకరాల భూమి మిగులును ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా అందులో 8.6 లక్షల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉందని గుర్తించారు.. బాబు అధికారంలోకి వచ్చే నాటికే అందులో 2 లక్షల ఎకరాలు పేదలకు పంచేశారు.. కాగా మిగిలిన 6 లక్షల ఎకరాలకు పైగా భూమి పంచడానికి సిద్దం గానే ఉంది.. మహిళలకు పంచుతా అని ప్రకటించిన బాబు తను 9 ఏళ్లు అధికారం లో ఉన్నా కూడా ఒక్క ఎకరా పంచింది లేదు.. వైయస్సార్ ఎప్పుడు భూ పంపకం పై హామీ ఇవ్వకపోయినా 2004-09 మధ్య 3 విడతల్లో దాదాపు 4.5 లక్షల మిగులు భూమిని పేదలకు పట్టాలిచ్చి పంచాడు.. హామీ ఇచ్చిన బాబుకి మాత్రం ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి పంచడానికి మనసు రాలేదు…
పైపెచ్చు మహిళలకు ఇచ్చే భూమిపై భూస్వాములు కన్నేస్తే శిక్షిస్తా అని బడాయి కబుర్లు చెప్పి, పంచకపోగా ఇంకా మిగులు భూముల స్వాదీనం పూర్తి కాకపోయినా, ఒక్క ఎకరా కొత్తగా స్వాధీనం చేసుకుంది లేదు తన తొమ్మిదేళ్లలో, ఆ కాలం లో బినామీ పేర్లతో, తోట పంటల పేరుతో, దేవాలయలాకు దానం పేరుతో భూస్వాములంతా ల్యాండ్ సీలింగ్ చట్టంలోని లొసుగులను వాడుకుని తమ భూమిని పదిలం చేసుకున్నారు.. అంటే బాబు హయాంలో పరోక్షంగా భూస్వాములు బాగుపడ్డారు… 9 ఏళ్లలో 6.5 లక్షల ఎకరాలు తన ప్రభుత్వ ఆధీనం లో ఉన్నా కూడా పంచడానికి మనసు రాలేదు.. ఆయన ఎవరి పక్షమో ప్రజలకు ఇప్పుడు పూర్తిగా అవగతం అయింది..