‘ఒకడు నన్ను నమ్ముకోండి. మీ తరఫున యుద్ధం చేసి గెలిపిస్తానన్నాడట. అబ్బో.. ఆయన పెద్ద పోటుగాడేమోనని చరిత్ర చూస్తే తన సొంత యుద్ధంలోనే ఓడిపోయిన ఘనుడిగా పేరొందాడు’ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు ఇలాగే ఉంది. రెండు చోట్ల ఓటమిని చవిచూసిన ఆయన ఈసారి ఎన్నికల్లో కూటమిలోని అభ్యర్థులను గెలిపిచ్చేస్తానని పర్యటనలు పెట్టుకున్నాడు. అదే సమయంలో తను పోటీ చేస్తున్న పిఠాపురంలో గెలుస్తాననే నమ్మకం లేక రోజుల తరబడి తిరిగేందుకు ప్రణాళిక వేసుకున్నాడు.
తమకు సేనాని ఏదొకటి చేస్తాడు.. ఎక్కువ సీట్లిస్తాడు.. ఇప్పిస్తాడని కాపులు భావించారు. కానీ స్థానాలు ఖరారయ్యాక చూస్తే సొంత సామాజికవర్గానికి పవన్ చంద్రబాబు నాయుడంత కత్తితో వెన్నుపోటు పొడిచాడు. టీడీపీ, జనసేన, బీజేపీలు కాపులకు కేవలం 23 సీట్లిస్తే వైఎస్సార్ కాంగ్రెస్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి 31 సీట్లు ఇచ్చారు. కాపుల ఆత్మగౌరవాన్ని పవన్.. చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టి అందినకాడికి వెనుకేసుకున్నాడని ప్రచారం ఉంది.
అయితే ఎన్నికల్లో కాపుల ఓట్లు కొల్లగొట్టేందుకు తన యజమాని బాబు ఆదేశాల ప్రకారం పవన్ నడుచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆ సామాజికవర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లోనే ప్రచారానికి రెడీ అయ్యారు. జగన్‌ను తిట్టేందుకు సినిమా రైటర్ల చేత స్క్రిప్ట్‌లు కూడా సిద్ధం చేయించుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా పవన్‌కు ఈసారి కూడా గెలుపుపై నమ్మకం లేదు. ఆయన పోటీ చేస్తాడంటూ అనేక ఊరి పేర్లు బయటకు వచ్చాయి. చివరికి పిఠాపురంను ఎంచుకున్నాడు. టీడీపీ ఇన్చార్జి వర్మ నుంచి వ్యతిరేకత రావడం.. వైఎస్సార్సీపీ గీత అనే మహిళకు సీటు ఇవ్వడంతో సేనానిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇక్కడ తన సామాజికవర్గం వారు అధికంగా ఉన్నా ప్రచారానికి ఎక్కువ రోజులు కేటాయించారు. శనివారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు పిఠాపురంలోనే ప్రచారం చేస్తారు. అనంతరం టీడీపీ ఆదేశాలతో మిగిలిన నియోజకవర్గాలకు వెళ్తారు. 3న తన సన్నిహితుడైన నాదెండ్ల మనోహర్ కోసం తెనాలిలో తిరుగుతారు. 4న నెలిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్‌లో రోడ్‌షోలు నిర్వహిస్తారు. 9న తిరిగి పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. మళ్లీ 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12 రాజానగరం వెళ్లి ప్రచారం చేస్తారు. తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చి 11 రోజులు మిగిలిన 11 నియోజకవర్గాలకు పోతారు. మళ్లీ ఐదురోజులు పిఠాపురంలో మకాం వేస్తారు. మరో ఐదురోజులు ఎంపీ అభ్యర్థులకు ప్రచారం చేస్తారు.
అత్తారింటికిదారేది సినిమాలో పవన్ సెకండ్ హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్ పెళ్లి చెడగొట్టడానికి జీబులో సర్రున వేరే ఊరు వెళ్తాడు. అత్త కోసం విదేశాల నుంచి వచ్చేస్తాడు. ఇంకో సినిమాలో ఒక్క సంతకం కోసం రాయలసీమ వెళ్లిపోతాడు. చాలా ఫైట్లు చేస్తాడు. నిజ జీవితానికి వచ్చేసరికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకుండా కాళ్లకు చంద్రబాబు తాళ్లు కట్టేశాడు. ఆయన చెప్పిన చోటుకే వెళ్లాలి. నేను పెద్ద హీరోని.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే కుదరదు. టీడీపీకి కాపుల ఓట్లు ముఖ్యం కాబట్టి ఉభయ గోదావరి జిల్లాల్లో తిరగాలి. తన గెలుపు చాలా అవసరమైన నేపథ్యంలో పిఠాపురంలో వర్మతో కలిసి ప్రచారాల్లో పాల్గొనాలి. నాకు తిక్కుంది.. దానికి లెక్కుందని డైలాగ్‌లు చెప్పే సేనాని ఒకరి చేతిలో పూర్తిగా బంధీ అని తేలిపోయింది.