ఫిజిక్స్‌లో థియరీ ఆఫ్ రిలెటివిటి అని ఒకటి ఉంటుంది. పెద్ద గీతను చిన్న గీత చెయ్యాలంటే… దాని పక్కన ఇంకా పెద్ద గీత గీయాలన్నమాట. ఇప్పుడు కొత్తగా గీసిన గీత పెద్దదా కాదా అని చెప్పగలిగేది అంతకు ముందున్న పెద్దగీతని చూసి.
రాజకీయాలకీ ఇది వర్తిస్తుంది. మేం వాళ్ళు కంటే బెటర్ పాలన అందిస్తాం, లేదా మేము చేసిన పాలనని ఇంకా బెటర్ చేస్తాం అనేది ఎన్నికల మేనిఫెస్టో యొక్క ముఖ్యోద్దేశం. అయితే 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరగబోతోందో ముందుగానే మూడోకంటితో చూసే విజనరీ, దేశంలోకి వచ్చిన ఏ కొత్త టెక్నాలజీని అయినా తన ఖాతాలో కనిపెట్టినట్టు వేసుకోగల ఆవిష్కరణ కర్త అయినటువంటి చంద్రబాబు ఈ ఎన్నికల మేనిఫెస్టో, హామీలు, పధకాల విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారు.
మొన్నటి వరకూ ప్రపంచంలో ఏ ప్రాంతం లేదా ఏ దేశం అయితే సంక్షోభంలో ఉందో ఆ దేశంతో ఆంధ్రాని పోల్చిన పచ్చపార్టీ ఇప్పుడు రూటు మార్చింది. జగన్ ఇస్తున్న పధకాలు, చేస్తున్న పాలన చూసి రాష్ట్రం లెవెల్లో పులివెందుల రాజకీయం అని, దేశం లెవెల్లో బీహార్ కన్నా ఆంధ్రా దారుణమయి పోనుందనీ, ఇక ప్రపంచంలో అయితే శ్రీలంక సంక్షోభం ఆంధ్రాలో కూడా వచ్చేయనుందని ఊదరగొట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పుడు హిరణ్యకశ్యపునిలా మారారు.
మా ప్రభుత్వం వస్తే “జగన్ ఇచ్చే పధకాలను కంటిన్యూ చేస్తాం”, “జగన్ కన్నా మంచి పధకాలను ఇస్తాం” అంటూ హిరణ్యకశిపుడు వద్దనుకుంటూనే హరినామ స్మరణ చేసినట్టు మాటకి ముందు, వెనకా కూడా జగన్ స్మరణ చేస్తున్నారు. వీళ్ళకి బెటర్ పాలన అనేదానికి పారామీటర్‌గా జగన్ పాలన గురించి మాట్లాడుతున్నారు తప్ప మేం 2014 లో చేసిన వాటిని ఇంకా బాగా చేస్తాం, లేదా వాటి కంటే మంచి పధకాలను అందిస్తాం అని మాత్రం అనలేకపోతున్నారు. మరి వాళ్ళు జగన్ ఇచ్చిన పధకాలనే ఇంకా ఇస్తే వాళ్ళు చెప్పినట్టు రాష్ట్రం శ్రీలంక అయిపోద్దో… ఏమిటో!!!!