ఈ విషయం పవన్ కళ్యాణ్ కి తప్ప రాష్ట్రం లో కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతీ ఒక్కరికి తెలుసు.. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ పరిస్థితి అధ్వానం గా ఉంది. ప్రతిపక్షం లో కూడా నిలబడలేని స్థితి దానిది..
ఈ విషయం పవన్ కళ్యాణ్ కి తప్ప రాష్ట్రం లో కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతీ ఒక్కరికి తెలుసు..
ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ పరిస్థితి అధ్వానం గా ఉంది. ప్రతిపక్షం లో కూడా నిలబడలేని స్థితి దానిది..
కాబట్టి ప్రత్యామ్నాయం గా మరో పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అవకాశం ఉంది.
జనాభా పరంగానూ, రాజకీయంగానూ బలమైన సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కు ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దానికి సిద్దంగా లేడు.. ఎప్పటికీ బాబు వెనకే ఉంటూ, బాబుకే లబ్ధి చేకూర్చాలి అనుకుంటున్నాడు…
కానీ బాబుకి ఈ విషయం లో మంచి స్పష్టత ఉంది. అందుకే పవన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఎదగనివ్వడు. ఒకవేళ పవన్ ఎదిగితే వైసీపీ కి ప్రత్యామ్నాయం గా ఇప్పుడు కాకున్నా 2029 కి అయినా ఎదిగే అవకాశం ఉంది. అప్పుడు టీడీపీ పూర్తిగా కనుమరుగైపోయే అవకాశాలు ఎక్కువ…
అందుకే పవన్ ను ఎట్టి పరిస్థితుల్లో తన నుండి దూరం జరగనివ్వడు, సగం-సగం పొత్తు పేరుతో దగ్గరికి తీసుకుంటాడు.. తీరా ఎన్నికల సమయానికి మీ బలం తక్కువని, కనీసం 50 సీట్లలో కూడా గెలవడం కష్టం అని, పాతిక సీట్ల కన్న్నా తక్కువ సీట్లు కేటాయిస్తాడు..
ఆ పాతిక సీట్లలో కూడా జనసేన బలంగా ఉన్న గోదావరి జిల్లాలో జనసేన కి కేవలం 6-7 సీట్లు కేటాయించి జనసేన ఓట్లతో మిగిలిన సీట్లలో టీడీపీ గెలవచ్చని ప్రణాళిక వేస్తాడు.. జనసేన కు అసలు బలం లేని చోట, వైసీపీ తప్పనిసరిగా గెలిచే చోట్ల, సీమ లో ఇలా అక్కడక్కడా ఇంకో 10-15 సీట్లు కేటాయిస్తాడు..
జనసేన- టీడీపీ పొత్తులో జనసేన కి కేటాయించిన సీట్లలో కొన్ని చోట్ల తన మనుష్యులకే టికెట్లు వచ్చేలా చేస్తాడు.. (ఎందుకంటే పార్టీ పెట్టి ఇన్నేళ్లవుతున్న పట్టుమని పది చోట్ల కూడా ఎమ్మెల్యే స్థాయి నాయకున్ని జనసేన సంపాదించుకోలేకపోయింది. అది పవన్ కళ్యాణ్ బద్దకం వల్లే అని నిర్మొహమాటం గా చెప్పొచ్చు…)
ఇక కొన్ని చోట్ల టీడీపీ రెబల్ అభ్యర్థులను ప్రోత్సహించి వారిచేత నామినేషన్ వేయిస్తాడు, జనసేన కి కేటాయించిన మిగిలిన సీట్లలో స్థానిక టీడీపీ నాయకులను జనసేన కి వ్యతిరేఖంగా పని చేసేలానో, సహకరించకుండానో టీడీపీ క్యాడర్ ను ప్రోత్సహిస్తాడు…
జనసేన పోటీ చేసిన చోట్లలో టీడీపీ సహకారం లేక, రెబల్స్ వల్ల, జనసేన అతి తక్కువ సీట్లు గెలుస్తుంది. (ఒక్క సీట్ గెలవకున్నా ఆశ్చర్యం లేదు) అదే సమయం లో టీడీపీ పోటీలో ఉన్న చోట జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానుల ఓటింగ్ వల్ల టీడీపీ అభ్యర్థుల గెలుపు కొంచెం సులువు అవుతుంది.. తద్వారా జనసేన ఓటింగ్ ద్వారా లబ్ధి పొంది, జనసేన గెలవకపోవడం వల్ల పవన్ కల్యాణ్ బలహీనుడని, గెలవలేడు అని ప్రచారం చేసుకోవచ్చు.. ఇక జనసేన ఎదుగుదల అనేదే ఉండదు… ప్రతిపక్షం లో ఉన్నా తానొక్కడే ఉంటాడు.. టీడీపీ బ్రతికే ఉంటుంది… అదే తనకు కావల్సింది… పొరపాటున అధికారంలోకి వస్తే, సీట్లు లేని జనసేన కి అధికారం లో వాటా ఇచ్చే అవసరమే ఉండదు, పదవుల పందేరమూ ఉండదు…
జగన్ మోహన్ రెడ్డి అయినా పవన్ కల్యాణ్ అసెంబ్లీ లో అడుగు పెడితే ఓర్చుకుంటాడు ఏమో గానీ, బాబు మాత్రం పవన్ కల్యాణ్ ని తనతోపాటు అసెంబ్లీ లో కూర్చోవడాన్ని అస్సలు భరించలేడు…
అందుకే పవన్ ఎక్కడ పోటీ చేసినా, ఎన్ని చోట్ల పోటీ చేసినా…. ఓడించేది మాత్రం బాబే….
“రాజకీయాల్లో మన ఎదుగుదల కన్నా పక్కవాని నాశనమే ముఖ్యం” … అనేదే బాబు సిద్దాంతం… ఆ విషయం గ్రహించే బిజెపి బాబును దూరం పెట్టింది.. పవన్ కల్యాణ్ ని కూడా బాబుకు దూరంగా ఉండమని, బీజేపీ – జనసేన కలిసి పోటీ చేద్దాం అని టీడీపీ తో పని లేదని, మీ ఎదుగుదలకు అన్ని రకాలుగా సాయం చేస్తామని ఎన్ని రకాలుగా బీజేపీ పెద్దలు చెప్పి చూసినా పవన్ మాత్రం బాబుతోనే ఉండాలి అనుకుంటున్నాడు…
బాబు పై పవన్ కు అంత ప్రేమ గల కారణం ఏమిటో? లోగుట్టు పెరుమాళ్ కే ఎరుక…