రాష్ట్ర ప్రతిపక్షనేత చంద్రబాబుకి కుప్పం భయం పట్టుకునట్టు ఉంది. సొంత నియోజకవర్గం కుప్పంలో రోజు రోజుకి పట్టు కోల్పోతున్నామేమో అనే కలవరపాటు ఆయనలో మొదలైనట్టు కనిపిస్తుంది. 35ఏళ్ళు కుప్పం ప్రజల ఓట్లని సంపాదించిన ఆయన కుప్పానికి కనీసం నీరు కూడా తీసుకుని రాలేకపోవడమే ఇప్పుడు ఆయనకి శాపంగా మారబోతుందనే ఆవేదన ఆయన చర్యలతోనే స్పష్టమవుతుంది. అందుకే చంద్రబాబు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నీరు అందిస్తే సహించలేక తనకి బాగా అలవాటైన అసత్య ప్రచారాలనే ఆయుధాన్ని బయటికి తీసాడు.
చంద్రబాబుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేయడానికి 35 ఏళ్ల సమయం ఇచ్చినా పూర్తి చేయలేకపోయారు, పైగా ఆ పనుల పేరున బినామీల జేబుల్లోకి నిధులు పారాయే కానీ, కాలువల్లోకి నీరు పారలేదు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టిన జగన్ గారు వెనుకపడిన కుప్పం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ తమకు సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత 57 నెలలుగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తే తార్కాణమని ప్రశంసిస్తున్నారు.
కుప్పం ప్రజల స్పంధన చూసి హడలిపోయిన తెలుగు తమ్ముళ్ళు తమకి భాగ అబ్బిన అసత్య ప్రచార ఆయుధాన్ని బయటికి తిసారు. సోషల్ మీడీయా వేదికగా అసత్యాలు చూపే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి జగన్ కాలువలో నీళ్ళు అని చెప్పి ఆ నిమిషం వరకు కొన్ని నీళ్ళు వదిలి తరువాత ఆపేశారని ఇది మోసం అని చెప్పి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం చూస్తే క్రాస్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను వదిలి 70.10 కిలోమీటర్ వద్ద తూము గుండా మద్దికుంట చెరువుకు నీటిని తరలించారు. శాంతిపురం మండలంలో 75.75 కిలోమీటర్ల వద్ద గల వెంకటేష్‌పురం శెట్టివానికుంట చెరువును పూర్తిగా నీటితో నింపారు.
గుండిశెట్టిపల్లి వద్ద గంగ పూజలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తితో కాలువలోని 84వ కిలోమీటరు వరకూ నీటిని విడుదల చేసి పూజల అనంతరం నీటిని పూర్తిగా మద్దికుంట చెరువుకు మళ్లించి, అది నిండిన తర్వాత నాగసముద్రం, మణీంద్రం చెరువుకు నీటిని పంపే ఏర్పాట్లలో జలవనరుల శాఖ అధికారులు ఉన్నారు, ఇది అందరికి తెలిసిన విషయమే కానీ కొందరు టీడీపీ కార్యకర్తలు రాజకీయ దురుద్దేశంతో కృష్ణా జలాలు ఆగిపోయాయని సోషల్ మీడీయా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది.
దశాబ్దాలుగా ఆదరించిన కుప్పం ప్రజలకి కనీసం ఏం మేలు చేయకపోయినా ఇన్ని రోజులు నెట్టుకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు జగన్ సీఎం హోదాలో, కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్, కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్, కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్, కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్, చిత్తూరు పాల డెయిరీని పున:ప్రారంభించింది మీ జగన్. వీటితో పాటు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఓక్కరికి సంక్షేమం అందించింది మీ జగన్ అని చెప్పిన మాటలు నిజంగానే చంద్రబాబుని భయపెట్టినట్టు కనిపిస్తుంది. అసలకే 2019 ఎన్నికల్లో రెండు రౌండ్లలో వెనుక పడ్డ చంద్రబాబు ఈసారి అన్ని రౌండ్లలో ఆ ఫలితం వస్తే ఎలాగా అని తెగ మదన పడిపోతూ తెలుగుదేశం కార్యకర్తల చేత ఇలా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని కుప్పం ప్రజలే చెబుతున్న మాట..