అవినాష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన బీటెక్ రవి వ్యాఖ్యలను లింగాల మండల నాయకులు తీవ్రంగా ఖండించారు. బీటెక్ రవి అవినాష్ రెడ్డిని నార్కో టెస్టుకు రావాలని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. లింగాల మండలంలో ఒక ఆడకూతురు చావుకు కారణమైన బీటెక్ రవి నార్కో టెస్టుకు సిద్ధమా అంటూ లింగాల మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు.
బీటెక్ రవి అనే వ్యక్తి చేయని తప్పుడు పనులు లేవని, అలాంటి తప్పుడు పనులు ఇతరులు కూడా చేస్తారు అనే భ్రమలో ఉంటూ ఉదయం లేవగానే అందరిపైన బురదజల్లే బీటెక్ రవి మాటలని రాష్ట్ర ప్రజలు నమ్మరని అలాగే పరిగణలోకి కూడా తీసుకోరని, ఎంపీ అవినాష్ రెడ్డి ఎలాంటి వ్యక్తో కడప జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజానికానికి మొత్తం తెలుసని పేకాట, మట్కా, బెట్టింగ్ ఆడుతూ ఆడిస్తూ బ్రతికే బీటెక్ రవి ఇలాంటి అసత్యారోపణలు మాట్లాడటం మానుకోవాలని లింగాల మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హితవు పలికారు.
ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన వేంపల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ 27 ఏళ్ళుగా వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయం చేసిన నన్నే ఆ కుటుంబం పల్లెత్తు మాట కూడా అనలేదని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఒక్క మాట చాలు వైఎస్ కుటుంబం ఎలాంటిదో చెప్పడానికి. ప్రజలు బీటెక్ రవి మాటలతో పాటు అతని టక్కుటమార విద్యలు చూస్తూ నవ్వుకుంటున్నారని ఆయన గుర్తించడం లేదు. జీవంలేని ఆరోపణలు చేస్తూ అందరిని మభ్యపెట్టాలని చూస్తున్న బీటెక్ రవి ప్రజల్లో నవ్వుల పాలవడం ఖాయం. తన టక్కుటమారా విద్యలన్ని అతను ఆడే జూదంలోనో, బెట్టింగులోనో లేక పేకాటలోనో వాడుకోవాలని అంతేగాని ఇలా అసత్య ఆరోపణలు చేయడం మంచిది లింగాల మండల నాయకులు హెచ్చరించారు.