చంద్రబాబంటే కాపులకు ఎప్పుడూ ఇష్టం లేదు. వారికి ఆయన విధానాలు నచ్చవు. ఎన్ని కుట్రలు చేసైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న బాబు వారి మద్దతు కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్‌ను తెరమీదకు తెచ్చి అధికారాన్ని పొందాడు. 2019లో ముందస్తు ఒప్పందంతో దూరం పెట్టినట్లు నటించి ఒకరికొకరు సహరించుకున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కాపులు వారిని తిరస్కరించి జగన్‌కు మద్దతుగా నిలిచారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాపు ఓటు బ్యాంక్ కోసం బాబు అండ్ కో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం. ఈయన కాపు ఉద్యమ నేతగా పేరొందారు. మాజీ ప్రజాప్రతినిధి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపుల హక్కుల కోసంగొంతెత్తారు. అయితే చంద్రబాబు, లోకేశ్ ఆయన్ను తీవ్రంగా అవమానించారు. కుటుంబసభ్యుల్ని తిట్టారు. వారిని అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఈ విషయాలను కాపు సామాజిక వర్గం మర్చిపోలేదు. అయితే టీడీపీ – జనసేన కూటమిని కాపులు పట్టించుకోవడం లేదు. 45 సంవత్సరాల వయసు పైబడిన వారు తమ వైపు రావాలంటే ముద్రగడ మద్దతు ఎలాగైనా పొందాలని చంద్రబాబు కుట్రలకు తెరతీశారు. ఆయన టీడీపీలోకి రాడని జనసేనను ముందు పెట్టారు. బాబు ఇచ్చిన సూచనలతోనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ముద్రగడ ఇంటికి తన దూతల్ని పంపారు. ఏం చెప్పినా వింటామని ఆఫర్ ఇచ్చారు. దత్తతండ్రి డైరెక్షన్లో ఈ అంశాన్ని పవన్ డీల్ చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముద్రగడను జనసేనలోకి తీసుకురావడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లను కొల్లగొట్టొచ్చని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే ఇది నెరవేరే సూచనలు కనిపించడం లేదు. 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఆ సామాజిక వర్గానికి అండగా నిలిచారు. కాపునేస్తం పథకం ద్వారా ఆర్థికంగా భరోసా కల్పించారు. కేసుల్ని ఎత్తివేయించారు. వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు. పదవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కుర్చీ కోసం ఎంతకైనా దిగజారే లక్షణం చంద్రబాబుది. అందుకే ఒకనాడు తాను ఇబ్బందులు గురిచేసిన ముద్రగడ ఇప్పుడు ఆయనకు ముద్దయ్యాడు. అయితే టీడీపీ, జనసేనకు వచ్చే ఎన్నికల్లోనూ కాపుల మద్దతుగా ఉండదని తెలుస్తోంది.