నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన ‘రా.. కదలిరా..’ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాతియుగం కోసం జగన్ వైపు వెళతారో.. స్వర్ణయుగం కోసం నాతో వస్తారో ప్రజలే తేల్చుకోవాలంటూ పిలుపిచ్చారు.. ఆ సభ పేరు “ రా.. కదలిరా” .
నిజానికి జనాలు ఒకసారి అలా కదిలొస్తేనే ఆయన అయిదేళ్లు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది.
చంద్రబాబు గారు పాలించిన కాలం స్వర్ణయుగమట.. గ్రామాలలో జన్మభూమి కమిటీల పేరిట అడుగడుగునా లంచాల దోపిడీ జరిగిన కాలమది.. పించన్ల నుండి ఇంటి పన్ను దాకా అన్నిటిల్లో అవినీతి జరిగిన కాలమది.. నీరు-చెట్టు అంటూ టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచేసిన కాలమది.. మహిళలకు కనీస భద్రత కల్పించలేని ఆ అయిదేళ్ళ కాలం స్వర్ణయుగమట.. మహిళా అధికారిని ఇసుకలో పడేసి కొట్టిన కాలమది.. టీడీపీ కీచకులు కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన కాలమది.. నిరుద్యోగ యువత అటు ఉద్యోగాలు లేక ఇటు నిరుద్యోగ భృతి లేక దిక్కు తోచనిస్థితిలో మిగిలిపోయిన కాలమది.. కేవలం చంద్రబాబు అడ్డగోలు వాగుడు వల్ల రైతులకు రుణమాఫీ కాక, డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు రుణాలపై వడ్డీలకు అదనపు వడ్డీలు పడిన కాలమది.. నీటి పారుదల ప్రాజెక్టుల్లో ఇంజనీర్ల మాటలు వినకుండా రాజకీయాలు చెయ్యడం వల్ల సాగునీరుకు తాగునీరుకు ప్రజలంతా విలవిలలాడిన కాలమది..
ఆంధ్రప్రదేశ్ ను జపాన్ చేస్తాను, సింగపూర్ చేస్తానంటూ.. ప్రజాధనమంతా బూడిదలో పోసిన పన్నీరులా వృధా చేసిన కాలమది.. రాజధాని కోసమంటూ ఒక్క కులానికి పట్టం కట్టేందుకు మిగతా రాష్ట్రాన్నంతటినీ గాలికి వదిలేసిన కాలమది.. చంద్రబాబుకు చెప్పుకునే ముందు సిగ్గెలా అనిపించట్లేదో మరి..
స్వర్ణయుగమంటే ఇంటి ముందుకే ప్రభుత్వాన్ని తీసుకురావడం.. పించన్ల నుండి సర్టిఫికెట్ల దాకా దేనికీ రూపాయి లంచం పెట్టే పనిలేకపోవడం.. రేషన్ బియ్యం ఇంటి ముందుకే రావడం.. పిల్లల చదువు బాధ్యత తల్లీదండ్రులది మాత్రమే కాదంటూ ప్రభుత్వమే చదివించడం.. రైతులను ఆదుకోవడం.. అక్కచెల్లెమ్మలకు ఆర్ధిక సాధికారత కల్పించడం..ఆటో డ్రైవర్ల నుండి.. చిరువ్యాపారులను సైతం మెరుగైన జీవినశైలి వైపు నడిపించడం.. నిరుద్యోగ యవతకు ఉద్యోగాలు కల్పించడం.. అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి తోడుగా నిలవడం.. అది స్వర్ణయుగమటే.. అదే వైఎస్ జగన్ పరిపాలనా కాలం..
2014 నుండి 2019 వరకూ ఏ యుగం.. 2019 నుండి 2024 వరకూ ఏ యుగమన్నది.. ప్రజలకు తెలుసు.. ఆవిధంగా స్వర్ణయుగాన్నే ఆహ్వానించి.. రాతి యుగపాలకుడిని హైదరాబాద్ కే పరిమితం చేస్తారులే బాబు .. తొందరపడకండి..