ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకపడిన రాయలసీమ ప్రాంతంలో డోన్ నియోజకవర్గం ఒకటి – డోన్, ప్యాపిలి ప్రాంతాలు తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కోవడం అక్కడి రైతాంగం కరువు కోరల్లో చిక్కుకుని అన్నివిధాలుగా నష్టపోవడం ఎప్పుడు వినిపించే మాట. అయితే ఇది గతం, చిత్తశుద్దితో పనిచేసే పాలకులు రావడంతో ఇప్పుడు డోన్ అభివృద్దిలో 50ఏళ్లు ముందుకు వెళ్ళిందనే చెప్పాలి.
స్వాతంత్య్రానికి పూర్వం నుండి రాజకీయాలతో ముడిపడి ఉన్న కుటుంబ నేపథ్యం ఉండి, ఉన్నత విద్యావంతుడైనా, కుటుంభ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ప్రజాసేవ మార్గాన్ని ఎంచుకుని బేతంచెర్ల గ్రామ పంచాయతీకి వరుసగా రెండు సార్లు సర్పంచ్‌గా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైయస్సార్ మరణానoతరం ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి వెంట నడిచి 2014-2019 లో వరసగా రెండు సార్లు డోన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
డోన్ శాసన సభ్యుడిగా ఎన్నికైన రోజు నుంచే అధికారంలో ఉన్నా లేకున్నా డోన్ నియోజకవర్గ అభివృద్దికే పాటుపడిన బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డి గారు 2014 ఎన్నికల ముందే బాలికల పాఠశాల ఏర్పాటు చేసి ప్రజల మనన్నలు పొందారు. 2019 ఎన్నికల ముందు ప్యాపిలి, బేతంచర్లలో వైద్యకళాశాలను ఏర్పాటుచేశారు. అలాగే కరువును తరిమే విధంగా ముఖ్యమంత్రి జగన్ గారి ఆశీస్సుల మేరకు కృష్ణగిరి మండలం ఆలంకొండ నుంచి 68 చెరువులకు హంద్రీ–నీవా కాలువ నుంచి 1.23 టీఎంసీ నీటిని తెప్పించగలిగారు. దీంతో బోర్ల ద్వారా స్ప్రింక్లర్లు, డ్రిప్ ద్వారా పంటలకు నీరు అందుతుంది. చెరువులకు నీళ్లు వచ్చాయనే ధీమాతో వేరుశనగ, పొద్దుతిరుగుడు, కూరగాయలు లాంటి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. చెరువులకు నీరిచ్చి తొమ్మిది మండలాల్లో 10,138 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు.
నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గారికే దక్కుతుంది. డోన్ కు రెవెన్యూ డివిజన్, సబ్ కోర్టు ఏర్పాటుచేశారు. డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలకు రహదారులు ఏర్పాటుచేసి ఆ దారుల్లోనే పాదయాత్ర చేసి చూపారు. డోన్ నియోజకవర్గానికి నీటి సమస్య ఉన్నందున గోరుకల్లు రిజర్వాయర్ నుండి 326 కోట్లతో ఇంటింటికి మంచినీరు అందించడానికి రంగం సిద్దంచేశారు. పట్టణ ప్రజలకు చిరస్థాయిగా నిలిచేలా 100 పడకల ప్రభుత్వాసుపత్రి, ఐటిఐ, బిసి, ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాలలు, క్లబ్ హౌస్, ఇండోర్ స్టేడియం, నూతన మునిసిపాలిటీ భవనం, సబ్‌కోర్టు, బిసి, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలు, కేంద్రీయ విద్యాలయం, మోడల్ కూరగాయల మార్కెట్, నాలుగు రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టం, జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జిలు, పార్కులు, నగరవనం, ఆర్అండ్బి గెస్ట్ హౌస్, పర్యాటకరంగం, ఆలయాల పునరుద్దరణ, బేతంచెర్లలో రెసిడెన్షియల్ కళాశాలలు, ప్యాపిలి మండలంలో గొర్రెల పెంపకం ట్రైనింగ్ సెంటర్, వాల్మీకి గుహలు, బిల్లల స్వర్గం గుహలు వంటి వాటిని అభివద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి గతంలో ఎన్నడూ చూడని అభివృద్దిని కేవలం 5ఏళ్ళలోనే చేసి చూపారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గ ప్రజల కోసం దాదాపుగా 2700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గతంలో ఎన్నడు చూడని అభివృద్దిని చేసి చూపిన ఘనత మంత్రి బుగ్గన గారికే దక్కుతుంది. బుగ్గన గారు శాసనసభ చర్చల్లో ఛలోక్తులతో, విషయపరిజ్ఞానంతో కూడిన ప్రసంగాలు చేయడమే కాకుండా అభివృద్దిలో నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళడంలో విజయం సాధించరని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒప్పుకోవడం విశేషం.