పీలేరు పట్టణం ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతినిధ్యం వహించిన నియోజకవర్గం, 1952 లో నియోగాజకవర్గం ప్రారంభం అయ్యి అప్పటి నుండి ఎన్నో ప్రభుత్వాల ఏలుబడిలో ఉన్న ఈ నియోజకవర్గ కేంద్రం పీలేరు పట్టణం లో 2019 వరకు 50పడకల ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే ఉంది, అరకొర సిబ్బంది తో ప్రభుత్వ ఆసుపత్రి అనారోగ్యంతో జనరల్ వార్డ్ లో పట్టించుకోని పేషెంట్ లా పడి ఉంది ప్రభుత్వ ఆసుపత్రి .
వైయస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2019 లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 648కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 47ఆసుపత్రులను అభివృద్ధి, స్థాయి పెంపు నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే పీలేరు నియోజకవర్గం లో పీలేరు ఏరియా ఆసుపత్రి 50పడకల నుండి 100 పడకలు స్థాయి పెంపు 24కోట్లు, వాయల్పాడు సిహెచ్సి ని 30 నుండి 50 పడకలు గా స్థాయి పెంపు 7కోట్లు కేటాయింపు.
సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సొంత మండలం కలికిరి ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అయన ప్రాతినిధ్యం వహించిన ఒకప్పటి నియోజకవర్గ కేంద్రం వాయల్పాడు(వాల్మీకిపురం) ఆసుపత్రుల ను పట్టించుకోక పోతే కలికిరి కి 6.48కోట్ల తో 2020 లో నవరత్నాలు లో భాగంగా కేటాయించి 30పడకల ఆసుపత్రి అభివృద్ధి, 7కోట్ల తో వాయల్పాడు ఆసుపత్రి అభివృద్ధి తో దాదాపు పీలేరు లో ముఖ్యమైన అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కి కంకణం కట్టుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజంపేట ఎంపీ, పీలేరు శాసనసభ్యులు.
పీలేరు 100పడకల ఆసుపత్రి కొత్త భవనం అత్యాధునిక వసతులతో ప్రత్యేక మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్, కంటి చికిత్స కొరకు ఆపరేషన్ థియేటర్, ENT సంబంధిత ఆపరేషన్ థియేటర్, ఆర్థో ఆపరేషన్ థియేటర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అన్ని రకాల రక్త పరీక్షలకు సంబందించిన అత్యాధునిక పరికరాలు అందుబాటు లోకి రానున్నాయి. వీటితో పాటు స్పెషలిస్ట్ డాక్టర్ లు, నర్సింగ్ స్టాఫ్ కూడా పెంపు జరుగుతోంది.
ఈ ఆసుపత్రి ద్వారా పీలేరు, కలకడ , రొంపిచెర్ల, యర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు, సదుం, కెవి పల్లి, పులిచెర్ల మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం దగ్గర లో అనుబాటులోకి రానుంది. ఇక మెరుగైన వైద్యం కోసం ఇక మదనపల్లి, తిరుపతి కి పోనవసరం లేకుండా సకల సౌకర్యాలతో 100 పడకల ఆసుపత్రి మెరుగులు దిద్దుకుని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
ప్రజలకు మౌలిక వసతుల అభివృద్ధి తోనే వారి జీవన విధానం, ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది అని నమ్మిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు వైద్య సేవలు అందించే విషయంలో చూపిస్తున్న చొరవ పలు మార్లు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకొంది.