చంద్రబాబు హయాం లో జరిగిన ఒకానొక భయంకర సంఘటన, బషీర్ బాగ్ లో పోలీసు కాల్పులు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై 2000వ సంవత్సరం లో జరిపిన కాల్పుల గురించి అందరికీ అవగాహన ఉంది.. కానీ అంతకు ముందే 1996 లో నే ఇలాంటి సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద కల్దారి రైల్వే స్టేషన్ సమీపం లో జరిగింది… పెరిగిన విద్యుత్ చార్జీలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై పోలీసు లు విచక్షణా రహితంగా కాల్పులు జరపగా ఇరువురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు మరో 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి… ఇది జరిగిన నాలుగేళ్లకు మళ్లీ విద్యుత్ చార్జీలు పెంపు పై బషీర్ బాగ్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజానీకం పై కాల్పులు జరిపాడు బాబు…
వాస్తవానికి 1991 లో రాజ చల్లయ్య కమిటీ సేల్స్ ట్యాక్స్ తగ్గించి, పన్ను ఎగవేతను అరికట్టడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవచ్చని రిపోర్ట్ ఇవ్వగా దాన్ని దశలవారీగా కేంద్ర ప్రభుత్వం అమలు పరిచి, 1999 సంవత్సరం లో పూర్తిగా అమలు చేసారు, తద్వారా కేంద్ర స్థాయిలో ఎక్సైజ్ సుంకం తగ్గగా, అందుకు భిన్నంగా రాష్ట్రం లో సేల్స్ టాక్స్ తగ్గించాల్సింది పోయి, ఆదాయం పెంచుకోవాల్సిందే అని, సేల్స్ టాక్స్ పెంపుకు నిర్ణయం తీసుకుంది బాబు ప్రభుత్వం. దానితో పాటు సబ్సిడీ బియ్యం ధరను పెంచడం, విద్యుత్ టారిఫ్ లను పెంచడం వంటి నిర్ణయాలను తీసుకుని ప్రజలపై పన్ను భారాన్ని విపరీతంగా పెంచేశాడు.. అది చాలదన్నట్టు రైతులపై నీటి తీరువా పన్నును కూడా విపరీతంగా పెంచాడు.. ఇదేమిటని అడిగిన సామాన్య ప్రజానీకానిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి వారి మరణాలకు కారణం అయ్యాడు..
ఆ తరువాత కూడా ప్రజలను శాంతింపచేయకుండా నేనింతే రేట్లు పెంచక తప్పదు. ప్రజలే త్యాగాలకు సిద్దపడాలి, రేట్లు తగ్గించడం కుదరదు అంటూ ప్రజల పై విద్యుత్, నీటి పన్నుల భారం వేసిన ఘనుడు మన బాబు .
అప్పుడే కాదు ఎల్లప్పుడూ రైతు వ్యతిరేక విధానాలు పాటించి, రైతుల వెన్ను విరిచే కార్యక్రమాలే మెండుగా చేశాడు బాబు.. సమోద శృష్టిస్తా, సంపద శృష్టిస్తా అంటూ డబ్బా కొట్టుకునే బాబుకి తెల్సిన సంపద పెంపు మార్గం పన్నులు విపరీతంగా పెంచడం, దిగిపోయేనాటిని ఖజానా ఖాళీ చేయడం.. అడిగిన వారిని పోలీస్ కాల్పులతో చంపి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం… ఇదే బాబు నైజం….