2014 జూన్ లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాబు ఎన్నికలు ముందు మానిఫెస్టోలోని హామీలే కాకుండా వెనుకబడిన ప్రాంతం శ్రీకాకుళం జిల్లాకు చాలా హామీలు ఇచ్చాడు ఆ హామీలు ఈ విధంగా ఉన్నాయి
– నూతన పారిశ్రామిక నగరం
– భావనపాడు, కళింగపట్నం పోర్టులు
– పైడిభీమవరం పారిశ్రామిక వాడ (వీసీఐసీ కేరిడార్)
– నూతన ఎయిర్‌పోర్టు
– శ్రీకాకుళాన్ని స్మార్ట్ సిటీగా
రూపొందించడం
– ఫుడ్‌పార్క్
– స్కూల్ ఆఫ్ ప్లానింగ్ మరియు ఆర్కిటెక్చర్
– వంశధార-నాగావళిపై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేయడం
– తెలినీలాపురం – పక్షుల సంరక్షణ కేంద్రం,బౌద్ధ చారిత్రక కట్టడాలు, శ్రీకూర్మం మరియు అరసవెల్లి దేవాలయాలను కవర్ చేస్తూ పర్యాటక కేంద్రాలు – -బారువ బీచ్.
– ఓపెన్ యూనివర్సిటీ
– ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్‌వేర్ పార్క్
నూతన పారిశ్రామిక నగరం నిర్మిస్తే వలసలు తగ్గుతాయి ఇక్కడే ఉపాధి కల్పించవచ్చు అని తెలిపాడు, అన్ని జిల్లాలకు ఇదే హామీ ఒక జిల్లాలో కూడా ఏర్పాటు చేయలేదు.భావనపాడు, కళింగపట్నం పోర్టులు రెండిటిలో కనీసం ఒకటి అయినా ఒక శాతం అయినా పూర్తి చేశాడా బాబు, భావనపాడు పోర్టు ప్రస్తుతం మూలపేట పోర్టుగా అభివృద్ధి చెందుతుంది. 2023 ఏప్రిల్ 19న సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని పనులు వేగంగా జరుగుతున్నాయి 2025 డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేసుకొని జాతికి అంకితం చేయాలని ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న విశ్వ సముద్ర కంపనీ వారు ప్రయత్నాలు చేస్తున్నారు, 2024 చివరికి ఒక బెర్త్ పనులు అయినా పూర్తి చేసి కార్యకలాపాలు నిర్వహించాలి అని అడుగులు వేస్తున్నారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా పైడిభీమవరం పారిశ్రామిక వాడ నిర్మిస్తా అని తెలిపాడు బాబు. ఆ కారిడార్ యే డెవలప్ చేయలేదు. ఆ కారిడార్ లో భాగంగా ఒక చోట కూడా ఒక పారిశ్రామిక వాడ కూడా నిర్మించలేదు. నూతన్ ఎయిర్పోర్ట్ ప్రకటనకే పరిమితం. శ్రీకాకుళంను స్మార్ట్ సిటీ చేస్తా అన్నాడు, ప్రతి జిల్లా కేంద్రానికి ఇలాంటి హామినే ఇచ్చాడు, ఒక్క జిల్లాని కూడా స్మార్ట్ సిటీ చేయలేదు. ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయలేదు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ను కూడా తీసుకురాలేకపోయడు. వంశధార నాగావళిపై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తా అన్నాడు, వంశధార ప్రాజెక్ట్ కోసం ఒడిశాతో ఉన్న వివాదంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఒకసారి కూడా చర్చించలేదు, జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఆ చొరవ తీసుకొని వెళ్ళి సీఎం నవీన్ పట్నాయక్ ను కలిశారు,ఇంకా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు ప్రయత్నం మాత్రం శూన్యం. తెలినీలాపురం – పక్షుల సంరక్షణ కేంద్రం, బౌద్ధ చారిత్రక కట్టడాలు, శ్రీకూర్మం మరియు అరసవెల్లి దేవాలయాలను కవర్ చేస్తూ పర్యాటక కేంద్రాలు, బారువ బీచ్ ఇలా పర్యాటకంగా కూడా అభివృధి చేయలేదు. ఓపెన్ యూనివర్సిటీను ఏర్పాటు చేయలేదు.ఎలక్ట్రానిక్స్ & హార్డ్‌వేర్ పార్కును పట్టించుకున్న పాపాన పోలేదు. సిక్కోలు చిరకాల సమస్య అయిన ఉద్దానం గురించి పట్టించుకొన్న పాపాన పోలేదు . ప్రజాఆరోగ్యంపై బాబుకు ఎంత మాత్రం దృష్టి వుందో మనం గమనించాలి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 700 కోట్లతో ఉద్దనం ప్రాజెక్ట్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి డయాలిసిస్ కోసం ఎక్కడికి వెళ్ళే ఇబ్బంది లేకుండా చేశారు. బాబు హామీలు గాలిలో పేక మేడలు కట్టినట్లు అంతే అమలు కానివి ఆచరణకు నోచుకోనివి , కనీసం ఒక హామీ అయినా చేయాలి అనే ఆలోచన లేకుండా, మళ్ళీ ఎన్నికలకు రావడం మళ్ళీ అదే హామీలు ఇవ్వడం చేయకపోవడం బాబుకే చెల్లింది.