2014 ఎన్నికల ప్రచారంలో నాకంటే అనుభవశాలి ఎవరూ లేరని చెప్పుకున్న చంద్రబాబు తీరా ఎన్నికలలో గెలిచి నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తో పాటు తూర్పు గోదావరికి కూడా లెక్కలేనన్ని హామీలనిచ్చి అమలు మాత్రం చేయలేదు. ఒకసారి చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాకు ఇచ్చిన హామీలను పరిశీలిస్తే..
తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ తీసుకొస్తానని గెలిచిన మొదటి నెలలోనే కేంద్ర పెట్రోలియం సహాయక శాఖ మంత్రిని కలిసి చంద్రబాబు హడావిడి చేశాడు. కలిసిన ఫోటోలు బయటికి వదిలాడు కానీ పెట్రోలియం యూనివర్సిటీ కి సంబంధించి ఎలాంటి ముందడుగు వేయలేదు.పెట్రోల్ కారిడార్ కి సంబంధించిన ప్రతిపాదనలు కూడా కేంద్రం ముందు పెట్టలేదు కానీ తన ఐదేండ్ల పాలనను గడిపేశాడు. పోర్ట్ ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చినా, అటు ప్రైవేట్ పోర్ట్ కానీ, ఇటు ప్రభుత్వం తరుపున కానీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయలేదు. దేశంలోనే అత్యధిక సాగర తీరం ఉన్న రాష్ట్రాలలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు తన ఐదేండ్ల పాలన లో ఒక పోర్ట్ కూడా కట్టలేకపోయాడు.
తెలుగు సాహిత్యపీఠం ఉన్న రాజమండ్రిలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఉన్న సాహిత్యపీఠంకు నిధులు కేటాయించకుండా కాలయాపన చేశాడు. కొబ్బరి పీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్ ను తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. స్మార్ట్ సిటీలుగా కాకినాడ, రాజమండ్రిలను అభివృద్ధి చేస్తానని చెప్పినా ఆవైపుగా ముందడుగు వేయలేదు . కాకినాడ మాత్రం కేంద్ర ప్రభుత్వ లిస్ట్ లో ఎంపిక కావడంతో పనులు అడపాదడపా జరుగుతున్నాయి. రాజమండ్రి గురించి కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదు. ఫుడ్ పార్క్, టూరిజం , భూ ఉపరితల జల మార్గాలు, కాకినాడ లో ఎల్.ఎన్.జి టెర్మినల్ ఇలా ఎన్నో హామీలను ఇచ్చి కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. తుని ప్రతిపాదిత నౌక నిర్మాణ కేంద్రం, ఆక్వా కల్చర్ ప్రాసెసింగ్ యూనిట్, రాజమండ్రిలో ఐటీ హబ్ ఇలా లెక్కలేనన్ని హామీలిచ్చి తన ఐదేళ్ల పాలనలో కాలయాపన చేసాడే తప్ప ఒక్క హామీనైనా నెరవేర్చే ప్రయత్నం చంద్రబాబు చేయలేదు.