2019 నుండి చేసిన అనేక విశ్వ ప్రయత్నాల తర్వాత నిన్న చంద్రబాబుకి ఢిల్లీ నుండి కబురు అందగానే కనీసం టీడీపీ ముఖ్య నాయకులతో గానీ, చివరికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో కూడా ఎలాంటి సమావేశం లేకుండా ఎవరి అభిప్రాయం కోరకుండా హుటాహుటిన బాబు ఢిల్లీ పయనమయ్యాడు..
ఈ గ్యాప్ లో తెలుగు తమ్ముళ్ళు ఆహా ఓహో, గెలిచేది బాబే, బాబే వచ్చేది, అందుకే బీజేపీ కబురంపింది అని తమకు మాత్రమే సాధ్యమైన ప్లేటు పిరాయింపు కార్యక్రమాలు మొదలు పెట్టారు.. తీరా చూస్తే… అసలు సమావేశం జరిగిందో లేదో కూడా నమ్మకంగా ఎవరికీ తెలియదు.. మర్యాద కొద్దీ నాలుగు మంచి మాటలు మాట్లాడితేనే, నన్ను వీరుడు, శూరుడు అంటూ పొగిడారు అని మీడియా ముందు వాయించే బాబు, మీటింగ్ అనంతరం మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు.. వెంటనే తిరుగు ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చేశాడు…
మీటింగ్ సూపర్ సక్సెస్ అనీ, మీలాంటి వారు మీ రాష్ట్రానికి అవసరం అని షా అన్నట్టు, దేశానికి బీజేపీ అవసరం అని బాబు అన్నట్లు జ్యోతిలో రాసుకొచ్చారు.. పాపం ఫోటో కూడా లేకపోయేసరికి ఎప్పటిదో 2017 నాటి ఫోటో తో ఫైల్ ఫోటో అంటూ సరిపెట్టారు…
అసలు బీజేపీ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్కోప్ ఎంత? ఇక్కడ ఎవరు గెలిస్తే మాత్రం వారికి వచ్చే లాభం ఏముంది? బాబు గెలుస్తున్నాడని పక్కకి తీసుకుంటే ఆ 10-15 ఎంపీ సీట్ల వల్ల బీజేపీ కి ఒరిగేది ఏముంది? నిజంగా గెలిచినా రేపు బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారం లోకి వస్తే అడక్కుండానే వెళ్లి బాబు మద్దతు ఇవ్వడూ? 2019 నుండి చూస్తున్నాం గా ముందు ముందే మద్దతు ఎలా తెలిపేవాడో?
ఇక బాబు వ్యక్తిత్వం ఎలాంటిదో పక్కాగా తెల్సిన వ్యక్తులు ఎవరంటే ముందు వరసలో ఉండేది మోడీ – షా లే… 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత మోడీ హైదరాబాద్ లో అడుగుపెడితే ఉరి వేస్తా అన్నాడు… మోడీ ఏమైనా మర్చిపోతాడా? వీహెచ్పి బలవంతానా, వైసీపీ ఆసక్తి చూపకపోవడం వలన తప్పక 2014 లో పొత్తు కుదుర్చుకున్నారు గానీ, అధికారం లోకి వచ్చాక ఏనాడూ టీడీపీ కి కేంద్రం అనుకూలంగా లేదు, టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేసి ఢిల్లీ లోని మినిస్టర్ క్వార్టర్స్ చేరే లోపే వాళ్ళ రాజీనామాలు ఆమోదం పొందాయి… ఇంత అవమానం ఏ పార్టీ కి జరగలేదు భారత దేశ రాజకీయాల్లో… అదీ బీజేపీ కి టీడీపీ మీద పర్టిక్యులర్ గా మోడీ షా లకి ఉన్న ఇంట్రెస్ట్…
మోడీ తల్లిని దూషించింది, తిరుపతి లో అమిత్ షా మీద్ రాల్లేయించింది… మోడీ గో బ్యాక్, రాష్ట్రం లోకి రావొద్దు అంటూ ఫ్లెక్సీ లు పెట్టింది….. వాళ్లప్పుడే మర్చిపోయుంటారా?? టీడీపీ కి ఎన్నికల్లో అన్ని విధాలుగా మద్దతు తెలిపి, వాళ్ల గెలుపుకు కృషి చేశాక, అనూహ్యంగా బీజేపీ కి ఏమైనా దెబ్బ తగిలితే ముందు జుట్టు పట్టుకునేది బాబే అని వాళ్లకి మాత్రం తెలియదా?
వాళ్లకి రాష్ట్రం లో కాస్త బేస్ కావాలి… దానికోసం ఒక ఎత్తు వెయ్యొచ్చు… గెలిచే అవకాశం ఉన్న ఒక 5-6 ఎంపీ సీట్లు అడిగి టీడీపీ మద్దతుతో ఒక నాలుగైనా గెలవచ్చు ఏమో అని ఆలోచనలో ఉండచ్చు.. అందుకే సరే ఇన్నేళ్ల నుండి అడుక్కుంటున్నావ్ గా రా… మాట్లాడుకుందాం అనుండవచ్చు… ఇక్కడ జ్యోతి లో వాళ్లే పిలిచినట్లు గా రాసిన కథనానికి కౌంటర్ గా టైమ్స్ నౌ లో, బీజేపీ నే టీడీపీ కి 6-8 ఎంపీ సీట్లు ఆఫర్ చేస్తుంది అని లీక్ ఇచ్చింది…
రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక లో బీజేపీ ఫోకస్ ఎక్కువగా ఉండబోతుంది… వాళ్ల స్ట్రాంగ్ బేస్ లో ఫోకస్ షిఫ్ట్ చేసి, ఆలూ-సూలు లేని ఏపీ మీద బీజేపీ ఎలా ఫోకస్ చేస్తుందని తమ్ముళ్ల ఆరాటమో ఏమో?