‘నేను తెలుగుదేశంలో చాలా సీనియర్. పార్టీ కోసం చాలా చేశా. అనకాపల్లి పార్లమెంట్ సీటు నా కుమారుడు విజయ్‌కు అడిగే హక్కు నాకుంది. బయటి నుంచి వచ్చే వారికి ఇస్తానంటే ఒప్పుకొంటానా. చంద్రబాబు నాయుడిని గట్టిగానే అడుగుతా. ఎలా ఇవ్వరో చూస్తా’ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చింతకాయల అయ్యన్న పాత్రుడి మాటలివి. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ఉన్నాడు. కానీ అయ్యన్న నోరు మెదపడం లేదు.
చాలాకాలం నుంచి అయ్యన్న అనాకపల్లి ఎంపీ టికెట్‌ను తన కుమారుడికి ఇప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. బుద్ధా వెంకన్న తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అయ్యన్న మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చారు. తమకే ఆ హక్కు ఉందన్నారు. అధినేత చంద్రబాబును అడుగుతూ వచ్చారు. కానీ కుటుంబానికి ఒక టికెట్ మాత్రమేనని ఆయన చెప్పారు. అయితే అయ్యన్న వదల్లేదు. ఇంతలో సీన్లోకి సీఎం రమేష్ వచ్చాడు. ఈయన నారా వారికి అత్యంత సన్నిహితుడు. బినామీ. పార్టీకి ఆర్థిక స్తంభం. బీజేపీలో ఉంటున్నా పాత యజమాని కోసమే పనిచేస్తాడనేది జగమెరిగిన సత్యం.
రమేష్ అనకాపల్లి సీటు అడగ్గానే చంద్రబాబు సరే అన్నారు. అప్పటి వరకు ఎగిరిన అయ్యన్నకు దిక్కు తోచలేదు. పలుచోట్ల ఒకే కుటుంబంలో రెండేసి సీట్లు ఇచ్చారు కదా.. నా విషయంలో ఎందుకిలా చేస్తున్నారని బాబును ప్రశ్నించగా ఆయన రమేష్ నాకు చాలా ముఖ్యం. ఆయనకు వయమన్నాడు. ఇందుకు గానూ రూ.20 కోట్లు విజయ్‌కు, అయ్యన్న ఎన్నికలకు సంబంధించి సగం ఖర్చు ఇచ్చేలా వారి మధ్య ఒప్పందాన్ని నారా వారు కుదిర్చినట్లు తెలిసింది. నిద్ర లేచింది మొదలు నోరేసుకుని అరిచే అయ్యన్న రమేష్‌ను ఏమీ అనకుండా మౌనంగా ఉండడానికి కారణం డబ్బేనని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.