రాష్ట్ర విభజన మూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని సింగరేణి బొగ్గు గనులు తెలంగాణాకి దక్కగా, ఏపీలో ధర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్లాంట్లకి అవసరమైన బొగ్గు లేకపోవడం సమస్యగా పరిణమించింది. గతంలో ఏపీలో బొగ్గు గనుల కోసం సింగరేణి పరిశోదనలు చేసి మూడు ప్రదేశాల్లో బొగ్గు గనులు ఉన్నాయని గుర్తించినా అవి ఏపీకి దక్కకుండా సింగరేణి సంస్థ అడ్డుకొంది. ఆ పరిశోధనలకు తాము పెట్టుబడి పెట్టామని కొర్రి వేయడంతో ఆ ప్రతిపాదన మూలన పడింది.
ప్రత్యామ్నయ మార్గాలు చూడాల్సిన టీడీపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్ లో ఏపీకి ఉన్న బొగ్గు గనుల నుండీ ఉత్పత్తి ప్రయత్నం చేయకుండా అధికారంలో ఉన్న నాలుగేళ్లు ఈ సమస్యని గాలికి వదిలేసి అయిదవ ఏట 2018 మే లో బొగ్గు గని నిర్వహణ, ఉత్పత్తి కోసం టెండర్లు పిలిచింది కానీ కార్యరూపం దాల్చలేదు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సాంకేతిక సమస్యలు పరిష్కరించి మధ్యప్రదేశ్లోని ఏపీఎండీసీ చెందిన బొగ్గు గని నుంచి ఉత్పత్తి కై పనులు ప్రారంభించారు. గత ఏడాది నుండీ బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాగా ఈ ఉత్పత్తి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి రూ.వెయ్యి కోట్ల రాబడి సాధించినట్లు సంస్థ ఎండీ వీజీ వెంకటరెడ్డి తెలిపారు.
ఉత్పత్తి ఆరంభించిన రెండో ఏడాదే ఈ రికార్డుకు చేరువ కావడంతో విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయంలో శుక్రవారం కేక్ కోసి వేడుకలు నిర్వహించారు. ఈ సంద
ర్భంగా వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో సంస్థకు రూ.1,700 కోట్ల ఆదాయం రావాలనే లక్ష్యం పెట్టుకోగా, ఈ డిసెంబరుకి రూ.వెయ్యి కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.
మార్చి వరకు మిగిలిన లక్ష్యాన్ని అధిగమిస్తామని ఆయన
ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి
ఆరు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ద్వారా రూ.
2,500 కోట్ల రాబడి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వెల్ల
డించారు. త్వరలో ఝార్ఖండ్లో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకి చెందిన బ్రహ్మదియా గనిలో కూడా బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.