జపాన్ లో జరుగుతున్న సైన్స్ ఫెయిర్ కు 7 మంది విద్యార్థులు ఎంపిక
ఒక స్పష్టమైన దిశ నిర్దేశం ఉంటే అనుకున్నది ఏమైనా సాధించవచ్చు అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరూపించింది. పాఠశాలలో నాడు నేడు ద్వారా ఒక పక్క రూపురేఖలు మారుస్తూ, మరో పక్క బోధనలో ఇంకో అడుగు ముందుకు వేసి జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యార్ధులను తీర్చి దిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయి జపాన్ లో సాగుతున్న సకురా సైన్స్ ఫెయిర్‌కు మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదివే 7 మంది విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్ కు ఎన్నికై ముగ్గురు విద్యార్థులు ఆల్రెడీ జపాన్ కు వెళ్లి వచ్చారు. మిగిలిన నలుగురు విద్యార్థులు వచ్చే మే లో వెళ్లనున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరుగుతున్న ఇన్స్పైర్ పోటీల్లోను మన విద్యార్థులు ముందు ఉన్నారు.
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యుట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో సైన్స్ పోటీలను నిర్వహిస్తోంది. దీని ద్వారా పాఠశాల స్థాయిలోని విద్యార్థులు తమ రోజు వారి జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపుతూ నమూనాలను తయారుచేయాలి. ఇందుకోసం ఇన్స్పైర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుంటే.ఆకర్షణీయమైన అంశాలౖపె ప్రాజెక్టు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.గత నాలుగేళ్లుగా 40 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టులు నమోదుచేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతుండగా, జాతీయ పోటీలకు 40 నుంచి 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి.
గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నుంచి ఒక ప్రాజెక్ట్ ఎంపిక అయితే గగనంలా ఉండేది. జాతీయ పోటీల్లో రాష్ట్రం నుంచి ఇంత పెద్దస్థాయిలో విద్యార్థులు ప్రాజెక్టులకు ఎంపికవడం ఇప్పుడే జరుగుతోంది.2019కి ముందు జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. ఉత్తమ ప్రాజెక్టులకు పేటెంట్ రైట్లు కూడా కల్పిస్తోంది ప్రభుత్వం.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 10 మంది గత సెప్టెంబరులో అమెరికా, యూఎన్ఓలో ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇలా ప్రభుత్వ పాఠశాల స్థాయిలో జరగడం మొదటి సారి. విద్య ప్రమాణాలు, సదుపాయాల పెరుగుదలకు, ఉపాధ్యాయుల శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో సత్ఫలితాలు కారణమని విద్యావేత్తలు అభినందిస్తున్నారు.