పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేల టీడీపీ చేసిన కుమ్మక్కు రాజకీయాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నర్సరావుపేట ఎంపీ అభ్యర్ధి అనీల్ కూమర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ మాచర్లలో టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు తాము ఫిర్యాదు చేసినా స్పందించలేదని, ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడిందని, 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చిందని మిగిలినవి బయటపెట్టకుండా ఈ ఒక్క ఈవీఎం ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారో చెప్పాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.
ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడిపై కూడా దాడులు చేశారని అయినా ఏ అధికారి సరైన రీతిలో స్పంధించలేదని, పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలు పగలగొట్టారని, జిల్లా వ్యాప్తంగా విధ్వంసం సృష్టించడమే కాకుండా తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారని, చింతపల్లిలో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారని, పాల్వాయి గేటు ప్రాంతంలో టీడీపీ నేతలు చేసిన విధ్వంసం కి సంబంధించి వీడియోలు ఎందుకు బయటకు రాలేదని, ఖచ్చితంగా టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టే విధంగా ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తామని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.