సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అగ్రభాగాన నిలిచింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గణాంకాలు (కాగ్) ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ తర్వాత రెండో స్థానంలో గుజరాత్ నిలిచింది. విద్య, వైద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, పారిశుధ్యం, మంచినీటి సరఫరాపై చేసిన వ్యయాన్ని సామాజిక రంగ వ్యయంగా పరిగణిస్తారు.
బడ్జెట్ కేటాయింపుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ -సెప్టెంబర్) వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ విడుదల చేసింది. సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తొలి ఆరు నెలల్లోనే 55.71 శాతం వ్యయం చేసినట్లు స్పష్టం చేసింది. సామాజిక రంగ వ్యయంపై ఏపీతో పోలిస్తే మరే ఇతర రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున వ్యయం చేయకపోవడం గమనార్హం. మరోవైపు ఆస్తుల కల్పనకు చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవగా తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల కల్పన కోసం తొలి ఆరు నెలల్లో 53.37 శాతం నిధులు వ్యయం చేయగా, తెలంగాణ తన బడ్జెట్ కేటాయింపుల్లో 60.86 శాతం వ్యయం చేసి ప్రథమ స్థానంలో నిలిచింది.
సామాజిక రంగ వ్యయంలో ఏపీ తరువాత గుజరాత్ 42.83 శాతం వ్యయంతో రెండో స్థానంలో నిలిచింది. సామాజిక రంగ వ్యయంలో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను పరిశీలిస్తే
ఆంధ్రప్రదేశ్(72,622 కోట్లు) 55.71%
గుజరాత్(43,107 కోట్లు) 42.83 %
కేరళ(23,313 కోట్లు) 42.75 %
తమిళనాడు (52,368 కోట్లు) 42.35 %
కర్ణాటక (39,551 కోట్లు) 42.30 %
6. తెలంగాణ (34,036 కోట్లు) 31.34%
ఆస్తుల కల్పనకు బడ్జెట్ కేటాయింపుల్లో 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు చేసిన వ్యయం