వైయస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో దూసుకుపోతుంది. దేశ వ్యాప్తంగా విదేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసే రాష్ట్రాల జాబితాలో ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 2023 – 24 తొలి క్వార్టర్(ఏప్రిల్ – సెప్టెంబర్) లో 85,021 కోట్ల ఎగుమతులతో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే 5 వ స్థానంలో నిలవడం గమనార్హం.
ఈ జాబితాలో గుజరాత్ 5,52,855 కోట్ల ఎగుమతులతో ప్రథమ స్థానంలో నిలవగా మహారాష్ట్ర 2,72,492 కోట్ల ఎగుమతులతో రెండో స్థానంలో నిలిచింది. మన దాయాది రాష్ట్రమైన తెలంగాణ 49,120 కోట్ల ఎగుమతులతో 8వ స్థానంలో నిలవడం విశేషం. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గంగవరం , రామాయపట్నం , మచిలీ పట్నం పోర్టుల నిర్మాణం పూర్తి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఖాయం..
ఎగుమతుల జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు..