నామినేషన్ గడువు సమయం దగ్గర పడుతున్నా అనపర్తి సీట్ విషయంలో ఇంకా క్లారిటీ లేకుండా పోయింది. 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీటీడీపీ జనసేన పార్టీలు పొత్తులలో భాగంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న విషయం తెల్సిందే. కూటమి తరుపున అనపర్తి సీటును బీజేపీకి కేటాయించారు. బిజెపి రాష్ట్ర అధిష్టానం అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి కృష్ణంరాజు కి మొదట ఖరారు చేశారు . అభ్యర్థిగా ప్రకటన తర్వాత నియోజకవర్గంలో కృష్ణంరాజు జోరుగా ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. కానీ అంతలోనే ఆ సీట్ టీడీపీ పార్టీకి చెందిన నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి కావాలి అని పట్టుబట్టాడు.
అనపర్తి అసెంబ్లీ సీట్ నుంచి ఇప్పటికే బిజెపి తరుపున కృష్ణంరాజు నామినేషన్ దాఖలు చేసిన ఆ సీట్ నుంచి కూటమి తరుపున నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి పోటీ చేస్తాడు అని ఇరుపార్టీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిని నిజం చేస్తూ బిజెపి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తన ప్రచార వాహనం పైన కూడా రామకృష్ణ రెడ్డి ఫోటో వేసుకొని ప్రచారం చేస్తుంటుంది. కానీ ఇప్పటి వరకు రామకృష్ణ రెడ్డికి ఈ పార్టీ తరుపున టికెట్ కేటాయించలేదు. బిజెపిలో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరపున పోటీ చేయమని రామకృష్ణారెడ్డిని బీజేపీ కోరింది. టిడిపి అధినాయకత్వం కూడా రామకృష్ణారెడ్డిని బిజెపిలోకి వెళ్లి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. కానీ రామ కృష్ణా రెడ్డి తాను టీడీపీ గుర్తు పైనే పోటీ చేస్తానని పట్టు పట్టి కూర్చొన్నాడు. దీంతో ఈ సీట్ పై స్పష్టత ఎప్పుడు వస్తుందో, ఎవరు పోటీ చేస్తారో కూటమి పార్టీల కార్యకర్తలకి సైతం అర్ధం కాని పరిస్థితి