2019 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో నవరత్నాలు అంటూ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లి అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకానికి నాంది పలికాడు. గతంలో ఇలా ఏ ప్రభుత్వం విద్యార్థులను పాఠశాలలకు పంపితే డబ్బులు ఇచ్చినా దాఖలాలు లేవు.
అమ్మ ఒడి పథకం కింద పిల్లల్ని బడికి పంపించే తల్లి ఖాతాలో ఏడాదికి 15 వేల రూపాయలు జమ చేస్తాను అనే హామీకి శ్రీకారం చుట్టాడు. విద్యార్థులు ఏ పాఠశాలలకు వెళ్లిన అనగా అటు ప్రభుత్వ ఇటు ప్రయివేట్ ఏ పాఠశాలకి వెళ్లిన అమ్మ ఒడి పథకం క్రింద డైరెక్ట్ గా తల్లుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బును జమ చేశాడు.ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 44, 48, 865 మంది లబ్ధిదారులకు 26,067 కోట్ల రూపాయలను అందించింది.
ఈ పథకం తీసుకురావడానికి ముఖ్య కారణం దిగువ మధ్య తరగతి స్థాయి కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు బాగుండక పోవడం వలన వారి పిల్లలకు మధ్యలోనే చదువును ఆపేసేవారు. ఈ పథకం ద్వారా చదువుకొనే విద్యార్థులు ఏడాది ఏడాదికి గణనీయంగా పెరిగి, డ్రాప్ ఔట్స్ శాతం సున్నకి తీసుకొని వచ్చారు.
ఒక పక్క ఇలా ప్రోత్సహిస్తునే మరో పక్క నాడు నేడు ద్వారా పాఠశాలల రూపు రేఖలు మార్చుకుంటూ వస్తూ , ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకుంటూ వెళ్తూ అందరినీ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేలా చేశాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.