అమరావతి రైతులము అని చెప్పుకుంటూ టిడిపి చేయిస్తున్న ఉద్యమానికి 1500 రోజులు పూర్తయ్యాయని, చారిత్రక ఉద్యమానికి తొలి పుట అమరావతి ఉద్యమమని చెప్పుకుంటున్న రాజధాని రైతుల పోరులో అసలు ఎంతమంది రైతులు ఉన్నారని అడిగిన ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకూ సమాధానం లేదు.
ఎందుకు పోరు, ఎవరి కోసమీ పోరు అని అడిగినా రాని సమాధానం. రైతులమంటూ చెప్పుకుని చేస్తున్న ఈ పోరులో అమరావతి టు అరసవల్లి యాత్రలో భాగంగా రైతులని వారి ఐడీ కార్డులను చూపించమని అడిగినపుడు ఏడొందలమంది ఉద్యమకారుల్లో కనీసం 70 మంది దగ్గర కూడా ఐడీ కార్డులు లేవు. మరి రైతు ఉద్యమయాత్రలో రాజకీయ శక్తులు ఎందుకు అని అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు.
సమాధానం లేక సావధానంగా ఆ యాత్ర నుండి వెనుదిరిగారు.
చంద్రబాబు హయాంలో అమరావతి చుట్టుపక్కల రైతుల దగ్గర నుంచి భూకబ్జాలు చేసి, రెవిన్యూ రికార్డులు మాయం చేసి, అసైన్డ్ ల్యాండులు రైతులకి అందించకుండా అన్యాయం చేసి ఇన్నేసి కుంభకోణాలు చేసారు. సరే రైతులకి న్యాయం కోసం వాటన్నిటిపై ఇప్పుడు విచారణ చేద్దామంటే కోర్టుల్లో అడ్డుకుంటున్నారు.
అన్ని రకాల అభివృద్ధి అమరావతి కేంద్రంగానే జరగాలని, అన్నీ తమకే చెందాలనీ, ప్రతి సంస్థ, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఇక్కడే ఉండాలని, రాయలసీమలో ఉత్రాంధ్రలలో పెట్టించొద్దని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా, అసలు ఈ ఉద్యమం పేరిట జరిగినన్ని వసూళ్ళు, వాటి లెక్కలు చూసుకుంటూ జేబులు నింపుకోవడమే అజెండాగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని వెనుక ఉండి నడిపిస్తున్నదెవరో అందరికీ తెలుసు. ఆయనకి అధికారం వచ్చే వరకూ, కావాలంటే ఇంకో అయదున్నరేళ్ళయినా ఈ ఉద్యమాన్ని ఇలాగే నడిపించి పబ్బం గడుపుకోగల సమర్ధుడు ఆయన. పాపం నష్టపోయేది రాజధాని పేరు చెప్పుకుని భూములు ఇచ్చిన అమాయక రైతులు, రైతులమని పేరు చెప్పుకుని పోరు చేస్తున్న చిన్నా చితకా నాయకులూను.