రెండేళ్ల క్రితం న్యాయస్థనం టూ దేవస్థానం అంటూ టీడీపీ ప్రేరేపిత అమరావతి ఉద్యమకారులు తమ పాదయాత్ర దారిలో ఒక్కో నియోజకవర్గానికి 50 లక్షలు చొప్పున చందాలు వసూలు చేశారు . అదే సమయంలో రాయలసీమ వరదలతో కకావికాలం అవుతుంది . అయినా కూడా తమ చందాల దందా ఆపకుండా టీడీపీ ఇంచార్జ్ లని వత్తిడి చేసి మరీ వరద బాధిత జిల్లాల్లో చందాలు వసూలు చేసిన విషయం విదితమే .
విపత్కర సమయంలో ఇలా వసూలు చేయడాన్ని ప్రజలు విమర్శించటంతో అప్పటికప్పుడు అమరావతి రైతు ఉద్యమ సమితి తరపున రాయలసీమ వరద బాధితులకు 15 లక్షల విరాళం ఇస్తున్నామని ప్రకటించారు . ఆ 15 లక్షలను చిత్తూరు , కడప , నెల్లూరు జిల్లాకు ఒక్కోదానికి 5 లక్షల చొప్పున ఆయా జిల్లాల కలెక్టర్ లకు అందజేస్తామని మీడియా సాక్షిగా ప్రకటించారు . ఇదే అదునుగా ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా అమరావతి రైతుల ఔదార్యం , పెద్ద మనసు , భూరి విరాళం , రైతు కష్టం అర్ధం చేసుకొన్న అమరావతి రైతులు అంటూ సన్నాయి వాయిద్యాలతో బాకాలూదేసి విరాళం అందించినట్లుగా రాసుకొచ్చాయి .
ఇది జరిగి రెండు సంవత్సరాల నెల రోజులు అవుతుంది.
వీరు ప్రకటించిన విధంగా రాయలసీమ వరద బాధిత రైతులకు విరాళమిచ్చారా ?. చిత్తూరు , కడప , నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు అందజేశారా ?. అని విచారిస్తే కరి మింగిన వెలగపండు సామెతగా ఆ ప్రకటించిన నిధుల్ని ఇవ్వకుండా ఇచ్చామని లెక్క రాసి ఉద్యమం పేరిట చందాలు వసూలు, ఖర్చు లెక్కలు చూసే కమిటీ మింగేశారని తెలుస్తుంది.
కడప , చిత్తూరు జిల్లాల కలెక్టర్ లకు అమరావతి ఉద్యమ సమితుల నుండి ఏ విధమైన విరాళమూ చెక్కు రూపేణా కానీ , నగదు రూపేణా కానీ , వస్తు రూపేణా కానీ అందలేదు.
పైగా ఇప్పుడా జిల్లాలు పునరవిభజన జరిగి పేర్లు కూడా మారిపోయాయి. ఒక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాకి 2021 సెప్టెంబర్లో 5 లక్షలు ఆ జిల్లా కలెక్టర్ కి అందజేసి మిగతా రెండు జిల్లాలకి ఇవ్వవలసిన పది లక్షలను అమరావతి ఉద్యమ జెఏసి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస రావు, ఉద్యమ నిర్వాహక కమిటీ ప్రధాన సభ్యురాలు రాయపాటి శైలజా, ఇతర కమిటీ సభ్యులు కలిసి పంచుకొన్నారని ఒక వార్త.
చివరికి ఇలా వరదలో చిక్కుకుని కష్టాల్లో ఉన్న రైతులకు సాటి రైతులుగా, అమరావతి ఉద్యమకారలుగా సాయం చేస్తున్నామని ప్రచారం చేసుకొని మోసం చేయడం దురదృష్టకరం .
నిద్ర లేచిన దగ్గర్నుండీ నీతులు చెబుతూ రాయలసీమకు దక్కాల్సిన అన్నీ దోచుకొంటూ చివరికి కష్టాల్లో ఉన్న సీమ వరద రైతులకు అదే ప్రాంతంలో వసూలు చేసిన కోట్లలో నుండి ఓ పదిహేను లక్షలు చందా ఇస్తామని మీడియా సాక్షిగా చెప్పి మీరు దేవుళ్ళు అని మీ మీడియాలో బాకాలు ఊదించుకొని చివరికి ఇలా విరాళాలు ఎగ్గొడతం ద్వారా అమరావతి ప్రేరేపిత ఉద్యమకారుల స్వార్ధం మరోసారి ప్రపంచానికి తేటతెల్లం అయ్యింది. .