2004 లో వైఎస్ చేతిలో ఘోర ఓటమి పాలయ్యిన తర్వాత 2009 నుండి వైఎస్ సంక్షేమాన్ని అనుసరిస్తూ కాపీ కొట్టిన సంక్షేమ పధకాలు ప్రకటించిన బాబు 2014 నాటికి అలివికాని 650 హామీలతో ఆల్ ఫ్రీ బాబుగా రూపాంతరం చెందారు కానీ అసలు బాబు వేరు. నేడు సూపర్ సిక్స్ అంటూ లక్షల కోట్ల రూపాయల హామీలు గుప్పిస్తున్న బాబు గతం చూస్తే ఔరా అని ముక్కున వేలేసుకోక తప్పదు.
అంత ఘనంగా ఏం చేశాడు అంటారా, ఓ వైపు పీవి సరళీకృత ఆర్ధిక విధానాలతో ప్రయివేటు రంగంలో పెట్టుబడుల ద్వారా అభివృద్ధికి బాటలు వేస్తుంటే, నేనేం తక్కువ తినలేదు అంటూ ప్రభుత్వ భాద్యత అయిన విద్య, వైద్య రంగాల్లో ప్రయివేట్ విధానాలకు బాటలు వేసి వాటిని పేదలకు దూరం చేసే అతి గొప్ప వినాశక చర్యలకు తెర లేపాడు మన బాబు గారు.
అవేంటంటే
1, ప్రభుత్వ ఆసుపత్రుల్లో యుజార్ చార్జీల వసూలు.
రెక్కాడితే గానీ డొక్కాడని బీద ప్రజలకు ఏ అనారోగ్యం వచ్చినా ప్రభుత్వ వైద్యాశాలల్లో చేసే ఉచిత వైద్యమే దిక్కు .
అలాంటి ప్రభుత్వ వైద్యశాలల్లో ఒపీ, ఇన్ పేషంట్ ఫీజు, టెస్ట్ లకు ఫీజు విధానానికి తెరలేపి ప్రభుత్వ ఉచిత వైద్యానికి నాడే మంగళం పాడే ప్రయత్నం చేశాడు బాబు . అదృష్టవశాత్తు 2004 లో వైఎస్సార్ అధికారంలోకి రాబట్టి ప్రభుత్వ వైద్యం పూర్తిగా ప్రయివేటు వైద్యంగా మారకుండా బతికి బట్ట కట్టడంతో పాటు ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీతో ప్రయివేటు హాస్పిటల్ లో కూడా ఉచితంగా వైద్యం చేయించుకొనే స్థితికి సామాన్యుడు ఎదగగలిగాడు .
అంతేకాదు ప్రభుత్వం తరపున మెడికల్ కాలేజీలు కట్టి నిర్వహించే ప్రయత్నం చేయకుండా ప్రయివేటు రంగం వారికి గేట్లు ఎత్తిన బాబు హయాంలో అన్ని ప్రయివేటు మెడికల్ కాలేజీలు తప్ప ఒక్క ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీ కూడా కట్టని చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడు బాబు.
నేడు వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు కడుతూ వాటిలో అయిదు పూర్తి చేసి ప్రారంభోత్సవం కూడా చేసిన శుభవేళ వాటిని కూడా విమర్శిస్తూ తాను కూడా 17 మెడికల్ కాలేజీలు కట్టానంటూ ప్రయివేటు, కేంద్ర మెడికల్ కాలేజీలు, 1980 లో కట్టిన కాలేజిల పేర్లు చెప్పుకొంటూ తిరిగే దౌర్భాగ్యం చంద్రబాబుకే సొంతం .