పాచిపోయిన పాత లడ్ల కబుర్లు ఇప్పుడు ఎందుకు బాబు. ఆ ఇప్పటం వ్యవహారంలో అప్పుడే పవన్ కల్యాణ్ఫూల్ అయ్యాడు.. పవన్ కల్యాణ్ సభ పెట్టాలని ఆలోచన రాకమునుపే ఆ గ్రామంలో రోడ్ల విస్తరణ కోసం రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ గోడలు కట్టుకున్న వారికి ఒక్కసారి కాదు మూడు సార్లు నోటిస్ లు ఇచ్చింది ప్రభుత్వం. పవన్ సభ పెట్టకముందే రోడ్ల విస్తరణ కార్యక్రమాలు మొదలయ్యాయి. అందులో భాగంగా రోడ్డును ఆనుకుని కట్టిన కొంతమంది ఇంటి గోడలను ప్రభుత్వం తొలగించింది. దానికి పవన్ సభకి ఎలాంటి సంబంధం లేదు. గోడలు తొలగించిన ఇళ్లలో కొన్ని వైసీపీ సానుభూతిపరులవి కూడా ఉన్నాయి..
సభ పెట్టి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇప్పటం గ్రామానికి 50 లక్షల రూపాయలు ఇస్తానని నీటి మీద రాతల లాంటి మాటలు మాట్లాడి ఇంతవరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. పైపెచ్చు గ్రామస్తులను రెచ్చగొట్టి అక్రమంగా ఇల్లు కూల్చారు, ముందస్తు సమాచారం ఇవ్వలేదని 39 మంది హై కోర్ట్ లో కేస్ వేయించగా, కోర్టు వారు ప్రభుత్వాన్ని వివరణ కోరింది, ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల తాలూకా కాపీ లను కోర్టుకు సమర్పించగా కోర్టు వారు కేసు వేసిన 39 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున పెనాల్టీ విధించింది… నిజంగా ప్రభుత్వం పవన్ సభకు స్థలం ఇచ్చిన కారణం చేతనే ఇల్లు కూలగొడితే, కేసు వేసిన వారికి కోర్టు వారు లక్ష రూపాయలు పెనాల్టీ వేయాల్సిన అవసరం లేదు..
ఇక సభలో ఇల్లు కూలిన 53 మందికి లక్ష చొప్పున ఇస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ చివరికి కోర్ట్ లో కేసు వేసిన 39 మంది తన సామాజికవర్గం వారికే లక్ష చొప్పున పెనాల్టీ కట్టుకోవడానికి ఇచ్చాడు…
ఈ విషయం లో పవన్ కళ్యాణ్ అప్పుడే ఫూల్ అవ్వగా ఇప్పుడు బాబు ఆ విషయాన్ని లేవనెత్తి పెద్ద ఫూల్ అయ్యాడు… నోరు తెరిస్తే అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టడం బాబు-పవన్ లకు ఉన్న ఉమ్మడి లక్షణం. అందుకే వారిద్దరికీ అంత బాగా బంధం ఏర్పడింది….