ప్రతి విషయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మార్చడం ఎల్లో మీడియాకు అలవాటే. ఈ క్రమంలో ఎన్నో వక్రభాష్యాలు చెబుతుంది. బాబు చేసింది కరెక్ట్ అని నమ్మించేందుకు రాతల్లో పనితనం చూపిస్తుంది. జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వడం బాబుకు ఇష్టం లేదు. ఇందులో భాగంగా పొత్తు పెట్టుకున్న నాటి నుంచి చంద్ర జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి రకరకాల కథనాలు వడ్డించింది. అధికారిక జాబితా విడుదల కంటే ముందే అభ్యర్థులు ఎవరో రాధాకృష్ణ ప్రకటించారు. అందులో కొన్ని జిల్లాల్లో మాత్రమే సేనకు అవకాశం ఇచ్చింది. కానీ అభ్యర్థుల పేర్లు చెప్పలేదు.
అందరూ ఊహించినట్లుగానే బాబు సేనను 24 అసెంబ్లీ, మూడు ఎంపీలకు పరిమితం చేశారు. దీనికి ఆదివారం నాటి ఇష్యూలో ఆంధ్రజ్యోతి ఇచ్చిన వివరణ జనసైనికుల మతిపోగొట్టింది. సామాన్యులైతే మనసారా నవ్వుకున్నారు.
జనసేనకు ప్రకటించింది∙24 సీట్లు.. ఇవాళ తేదీ 24.. సంవత్సరం 2024.. చివర 24 సంఖ్య రావడం కలిసొచ్చే అంశంగా జనసైనికులు విశ్లేస్తున్నారు. అధినేత అభిప్రాయం ప్రకారమే ఇలా 24.. 24.. 24గా నిర్ణయించడమైందని చెబుతున్నారు. ఈ సంఖ్యను పవన్ సెంటిమెంట్‌గా భావించారని అభిప్రాయపడుతున్నారు. సేనాని 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. దీని వెనుక ఓ లాజిక్ ఉందంటున్నాయి జనసేన శ్రేణులు. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో పాండవులదే విజయం. నూరుమంది కౌరవులను పాండవులు మట్టి కరిపించారు. అందుకే ఐదు సీట్లను ప్రకటించారంటూ ఆంధ్రజ్యోతి రాసింది.
బాబుకు లొంగిపోయి పవన్ కేవలం 5 ఐదు సీట్లు ప్రకటించి మిగతా 19 ఆపాడు. ఇది నిజం. కానీ ఈ విషయాన్ని ప్రజలకు మరోలా చెప్పేందుకు జ్యోతి అద్భుతంగా ట్విస్ట్ చేసింది. అసలు సోసల్ మీడియాలో జనసైనికులు ఏ విధంగా తమ అధినేతను, చంద్రబాబును తిడుతున్నారో తెలిస్తే రాధాకృష్ణకు గుండె ఆగినంత పనవుతుంది. ఆ 19ని ఎక్కడ ఇస్తాడో తెలియదు. వాటిలో ఎక్కువ సీట్లలో తెలుగుదేశం నుంచి వెళ్లిన వారే పోటీ చేసే అవకాశముంది. అప్పుడు పవన్‌కు 24 స్థానాలు ఇచ్చినట్లు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. నాడు ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా ఎల్లో మీడియా వార్తలు రాసి ముంచేసింది. నేడు పవన్‌ను గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తోంది. మాకు అన్యాయం జరిగిందని సేనాని అభిమానులు భావిస్తుంటే జ్యోతి రాసిన ఈ వార్త వారికి ఆగ్రహం తెప్పిస్తోంది. అధినేతే నాకు ఎన్ని ఇచ్చినా ఓకే అన్నాడు. ఇక వాళ్లు జానీ సినిమాలోని ఓ పాటలో ఉన్న నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుని.. గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినొన్ని.. నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుని లైన్స్ పాడుకోవడం తప్ప ఇంకేమీ లేదు.
– వీకే..