‘నువ్వు అడిగిన టికెట్లు ఇవ్వలేదని ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా.. రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నా. నీ పనితీరు ఏ మాత్రం బాగోలేదు. పోటీ చేస్తే ఉద్ధేశం లేకపోతే వదిలేయాలి. అంతేకానీ ఇలా చేయడం ఎందుకు. ఇంత సీనియర్ నాయకుడివి జనాన్ని సమీకరించలేవా. డబ్బులిస్తారో.. బతిమిలాడుకుంటారో నాకు తెలీదు. రెండు గంటలు టైం ఇస్తున్నా. నేను వచ్చేసరికి జనం కనిపించాలి. లేకపోతే.. నా సంగతి తెలుసుగా..’ అంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆత్మకూరు నియోజకవర్గం అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డిపై […]
– టీడీపీలో ఉన్న వారికే కండువాలు కప్పుతూ.. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్), ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి చీప్ ట్రిక్స్ చూసి ప్రజానీకం నవ్వుకుంటున్నారు. టీడీపీని ఎవరూ పట్టించుకోవడం లేదని, హైప్ తెచ్చేందుకు పార్టీలో ఉన్న వారికే కండువాలు కప్పేస్తున్నారు. వారు చేరారు.. వీళ్లు చేరారు.. వైఎస్సార్సీపీ ఖాళీ అయిపోయిందని చీప్ ట్రిక్స్ ప్లే చేసి సంబర పడిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు చాలా ఏళ్ల నుంచి […]
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలను ఆనం కుటుంబం చాలా సంవత్సరాలపాటు శాసించింది. కానీ ఇప్పుడది గత వైభవంగా మిగిలిపోయింది. నేడు కనీసం ఒక్క నియోజకవర్గం కూడా వారి గుప్పిట్లో లేదు. దీనంతటికి రామనారాయణరెడ్డి స్వార్థంతో తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రచారం ఉంది. ఆనం వివేకానందరెడ్డి, రామనారాయణరెడ్డి నెల్లూరు కేంద్రంగా వివిధ పార్టీల నుంచి రాజకీయాలు నడిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వీరి మాట చెల్లుబాటైంది. కాలం మారిపోయింది. అదే రామనారాయణరెడ్డి ప్రస్తుతం ఆత్మకూరులో తన గెలుపు కోసం […]
ఆనం రామనారాయణరెడ్డి ఆశలకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెక్ పెట్టేశారు. కోరిన చోట టికెట్ ఇవ్వకుండా మరో నియోజకవర్గానికి తరిమేశారు. దీంతో జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం కుటుంబానికి ఇవే చివరి ఎన్నికలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రామనారాయణరెడ్డి దివంగత వైఎస్సార్ పుణ్యాన మంత్రి అయ్యారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన వేసిన తప్పటడుగులే శాపాలయ్యాయి. ఆనం ఫ్యామిలీ పనైపోయిందని అందరూ భావించిన తరుణంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో వెంకటగిరి టికెట్ ఇచ్చి గెలిపించారు. […]
చంద్రబాబు శనివారం తొలి జాబితా విడుదల చేశారు. ఇందులో ఉదయగిరి సీటును కాకర్ల సురేష్ అనే వ్యక్తికి ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి బొల్లినేని రామారావుకే హ్యాండ్ ఇచ్చారు. ఈయన మహారాష్ట్రలో కాంట్రాక్టర్‌గా ఉన్నారు.
వైస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు గడువు కావాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో సదరు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది.. వచ్చేనెల 26 కు విచారణను వాయిదా వేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.. కాగా వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్లపై ఏపీ […]
మార్చి నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు స్పీకర్ ముందుకు వచ్చింది. అధికార పార్టీ వైకాపా నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు కింద అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరారు. వైకాపా ను అనుసరించి టీడీపీ కూడా తమ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలను కూడా అనర్హత వేటు వేయమని కోరింది. కాగా ఇక్కడ వైకాపా ను వీడిన ఎమ్మెల్యేలందరూ ఈ పాటికే టీడీపీ కండువ వేసుకొని […]