ప్రపంచం లో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి నార్వే. మానవాభివృద్ధి సూచీలోనూ, తలసరి ఆదాయ సూచీ లోనూ, పేదరిక సూచీలోనూ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల అభివృద్ధి సూచీలలో నార్వే మొదటి మూడు స్థానాల్లోనే ఉంటుంది.. అంత మాత్రానికే అక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప వనరులు ఉన్నాయని కాదు. సంవత్సరం లో ఆరునెలలు పూర్తిగా చీకటిలోనే ఉండే దేశం అంత ప్రగతి ఎలా సాధించింది…
వనరులు ఉండటం గొప్ప కాదు, తక్కువ వనరులు ఉండటం శాపమూ కాదు… కానీ ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని వాటి ద్వారానే పక్కా ప్రణాళికతో వేగంగా అభివృద్ధి చెందవచ్చు అని ప్రపంచానికి నిరూపించిన దేశాల్లో జపాన్, నార్వే లు ముందు వరసలో ఉంటాయి..
కానీ మనం నార్వే గురించి చర్చించుకోవడానికి ఒక కారణం ఉంది… నార్వే కి విశాలమైన తీర ప్రాంతం ఉంది. ఒకప్పుడు పూర్తిగా నార్వే దేశం చేపల వేటకే ప్రసిద్ధి. దాని ద్వారానే వారు మనుగడ సాదించారు కూడా. అభివృద్ధి చెందుతున్న కొద్దీ వారి సముద్ర రవాణా రంగాన్ని బాగా అభివృద్ధి పరచుకున్నారు. మెరైన్ ఫుడ్ ఎక్స్పోర్ట్ ద్వారా వారి దేశ స్థూల జాతీయోత్పత్తి పెంచుకున్నారు.. తర్వాత కాలంలో పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఎగుమతులు కూడా పెరిగాయి. వారి దేశం యొక్క మొత్తం పరిశ్రమల్లో మేజర్ వాటా ఈ సముద్ర ఉత్పత్తులు, ఆయిల్ కంపెనీ లే అధికం.. మారుతున్న ప్రపంచ అవసరాల దృష్ట్యా గ్రీన్ ఎనర్జీ పై దృష్టి సారించారు కూడా.. పరిశ్రమల రంగం సరిగ్గా అభివృద్ధి చెందితే దాని తదుపరి పరిణామం గా సేవా రంగం కూడా వృద్ధి లోకి వస్తుంది, నార్వే లో కూడా అలానే, భీమా రంగం, టూరిజం, షిప్పింగ్ ఇలా గొలుసుకట్టు లా ఒకదానితో ఒకటి అనుబంధంగా వృద్ధి చెందాయి..
చేపలు పట్టుకునే వాళ్లే ఉండే ఒక దేశం ఇంత అభివృద్ధి సాధించింది అంటే దాని అర్థం వనరుల యొక్క సరైన వినియోగమే…
ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే…
భారత దేశానికి మొత్తం 7516 కిలోమీటర్ల తీర రేఖ ఉండగా, 1214 కిలోమీటర్లతో గుజరాత్ అతి పెద్ద తీర రేఖ కలిగి ఉండగా, ఆంధ్రప్రదేశ్ 972 కిలోమీటర్లతో రెండో స్థానం లో ఉంది.. కానీ గుజరాత్ ఎదుగుదలో దాని తీర రేఖ పోషించినంత ముఖ్య పాత్ర ఆంధ్ర ప్రదేశ్ పోషించడం లేదు.
తూర్పు తీరంలో అతిపెద్ద తీర రేఖ కలిగి, రోడ్డు రవాణా వ్యవస్థ బాగున్నా ఆంధ్ర ప్రదేశ్ యొక్క అభివృద్ధి కి విశాలమైన ఈ తీర రేఖ ను సక్రమంగా వినియోగించుకోడం ఎంతో అవసరం..
అది కాకా, ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికే దేశం లో మొత్తం సీ ఫుడ్ ఎగుమతిలో 34.76% వాటా తో అగ్రస్థానం లో ఉంది.. చేపల ఉత్పత్తి, ఎగుమతిలో మొదటి స్థానంలోను, రొయ్యల ఎగుమతిలో 36% వాటాతో రెండో స్థానం లో ఉంది.. గతేడాది మొత్తం sea food ఎగుమతులు 57 వేల కోట్లు కాగా, ఒక్క ఆంధ్ర ప్రదేశ్ నుండే 18 వేల కోట్ల ఎగుమతులు జరిగాయి.. అంటే దాదాపు మూడో వంతు ఎగుమతుల వాటా కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్..
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే జగన్ మోహన్ రెడ్డి తన దృష్టిని తీరరేఖపై కేంద్రీకరించాడు. పోర్టు ల నిర్మాణం ద్వారా ఈ ఎగుమతులను మరింత పెంచాలి, తద్వారా మెరైన్ ఫుడ్ పరిశ్రమల స్థాపన జరుగుతుంది, ప్రాసెసింగ్ యూనిట్ లు, గ్రేడింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ తదితర పరిశ్రమల ఏర్పాటు వేగంగా జరుగుతుంది.. ద్వితీయ రంగం అయిన పరిశ్రమల రంగం బాగా అభివృద్ధి చెందితే సేవా రంగం మరింత పటిష్టపరచబడుతుంది. ఆర్ధిక సంస్కరణల తర్వాత భారత్ లో సేవా రంగం అభివృద్ధి చెందినంత వేగంగా పరిశ్రమల రంగం అభివృద్ధి చెందలేదు కాబట్టే భారత్ లో అభివృద్ధి వేగంగా జరగడం లేదు. అభివృద్ధి చెందిన ఏ దేశం లో అయినా ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి(జి.డి.పి) లో పరిశ్రమల రంగం వాటా 40% పైనే ఉంటుంది కానీ భారత్ లో అది 25% లోపే ఉంటుంది… అందుకే భారత్ జాబ్ లెస్ గ్రోత్ సాధిస్తుంది… కారణం సేవా రంగం లో కల్పించే ఉపాధికన్నా, పరిశ్రమల రంగంలో కల్పించే ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి చాలా రెట్లు అధికం.. అందుకే IT కంపెనీ ల కన్నా రాష్ట్రానికి ఎక్కువ స్కోప్ ఉన్న ఈ మెరైన్ పరిశ్రమలపై, ఇతర పరిశ్రమల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయడం సులువు గా ఉండే విధంగా సౌకర్యాలు కల్పించేందుకు దృష్టి సారించింది ఈ ప్రభుత్వం..
అందుకే రామాయపట్నం, కాకినాడ, భావనపాడు, మచిలీపట్నం లలో కొత్తగా నాలుగు పోర్ట్ ల నిర్మాణం చేపట్టారు, వీటితోపాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ లాండింగ్ సెంటర్లు నిర్మాణం చేపట్టారు.. ఎంత అభివృద్ధి చెందిన దేశంలో అయినా ఇన్ని ప్రాజెక్టులు ఒకేసారి కట్టడం దాదాపు అసాధ్యం. కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వీటిని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తుంది..
దానికి తోడు ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ పై దృష్టి సారించిన కారణం చేత, అదానీ గ్రీన్ ఎనర్జీ వారితో, ఎన్టీపీసీ గ్రీన్ కో వారితో, ఒప్పందం కుదుర్చుకుని భారీ స్థాయిలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్త్తి చేయుటకు పరిశ్రమల స్థావనకోసం పనులు మొదలు పెట్టారు, ప్రపంచంలో అతిపెద్దదైన గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ను కర్నూలు జిల్లాలో నెలకొల్పారు… మొత్తంగా 9.57 లక్షల కోట్ల పెట్టుబడులు ఎనర్జీ రంగం లో సాధించారు..
అందుకే ఇది నార్వేజియన్ మోడల్… నార్వే, జపాన్, దుబాయ్ ల అభివృద్ధి IT కంపెనీ ల ద్వారా జరగలేదు…
వనరులని సక్రమంగా వినియోగించుకోవడం తెలిస్తే చాలు… అభివృద్ధి దానంతట అదే వేగంగా జరుగుతుంది…