రాష్ట్ర ప్రభుత్వం మూడు విద్యాసంస్థలను విశ్వవిద్యాలయాలుగా మార్చేందుకు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016కు సవరణలు చేసి బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో మూడు వర్సిటీలకు ఓకే చెబుతూ బుధవారం నాటి మంత్రి వర్గంలో తీర్మానం చేశారు. తాజాగా దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఈ బిల్లు ప్రకారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచారయ్య, రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్, కాకినాడ జిల్లా సూరంపాళెంలో ఆదిత్య విద్యాసంస్థలు యూనివర్సిటీలుగా మారుతాయి. వీటిలో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు.