టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ పర్యటన చివరి క్షణంలో వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించడానికి ఏప్రిల్ 21, 22 న రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించాల్సి ఉండగా మస్క్ పర్యటన రెండు రోజుల ముందే వాయిదా పడింది. కాగా మస్క్ భారత్ పర్యటన వాయిదా పడటానికి కారణం తెలియరాలేదు.
మస్క్ పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ‘భారతదేశంలోకి పెట్టుబడులు రావాలని నేను కోరుకుంటున్నాను. దేశంలో ఎవరు పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు. కానీ, ఉద్యోగులు మన సొంత ప్రజలే ఉండాలి. ఉత్పత్తిలో మన నేల సారాంశం ఉండాలి.. తద్వారా దేశంలోని మన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
మరోవైపు ఏప్రిల్ 10న భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే సమావేశం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అంటూ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా వెల్లడించారు. టెస్లా కార్ల ప్లాంట్ భారత్‌లో ఏర్పాటు చేసి దాదాపు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతారనిప్రచారం జరిగింది. ఎలాన్ మస్క్ భారత్ పర్యటన నేపథ్యంలో టెస్లాకు చెందిన కీలక అధికారుల బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించి పెట్టుబడులకు అనువైన ప్రదేశాల గురించి వెతికేపనిలో పడ్డాయి.
ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదాకు గల కారణాలు తెలియరాలేదు. టెస్లా మొదటి త్రైమాసిక పని తీరు గురించి ఏప్రిల్ 23వ తేదీన యునైటెడ్ స్టేట్స్లో జరిగే కీలకమైన కాన్ఫరెన్స్ కాల్‌కు ఎలాన్ మస్క్ హాజరు కావాల్సి ఉండటం వల్ల భారత దేశ పర్యటనను రద్దు చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది.