1990 సెప్టెంబర్ – RSS Block board..
బొంబాయి కాల్బాదేవి ఏరియాలో కాటన్ ఎక్స్చేంజి జంక్షన్ లో ఒక బ్లాక్ బోర్డు ఉంటుంది .. రెగ్యులర్ గా ఆ బోర్డు మీద మెస్సేజిలు అప్డేట్ చేస్తూ ఉండేవారు ..హిందూ రాష్ట్ర ఏర్పాటు, గోవుల పవిత్రత హిందువులను చుట్టుముట్టే బెదిరింపుల గురించి , ప్రతిపక్ష పార్టీ ముస్లింలను బుజ్జగించడం గురించి , జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించిన విషయాలు, అఖండ భారత్ కి సంబంధిత ఫిలాసఫీ … ఇటవంటి విషయాలు అన్ని ఆ బోర్డు మీద రాసేవారు.
అర్ఎస్ఎస్ & ప్రజల మధ్య కమ్యూనికేషన్ కి ప్రధాన లింక్ ఆ బోర్డు … అర్ఎస్ఎస్ బ్లాక్ బోర్డు అంటారు
1990 సెప్టెంబర్‌లో ఆ బోర్డు పైన కాషాయం పోస్టర్ : అద్వానీ ఫోటో కింద బోల్డ్ ఫాంట్లో – రథంలో రాబోయే నగర సందర్శనను ప్రకటించింది.
కల్బాదేవిలో ఈ మొదటి పోస్టర్ కనిపించిన తర్వాత, అద్వానీ రథయాత్ర బొంబాయిలో చర్చనీయాంశమైంది. వందలాది బ్యానర్లు మరియు పోస్టర్లలో అద్వానీ, చేతిలో విల్లు పట్టుకుని ఉన్న రాములవారి అగ్గ్రెస్సివ్ postureలో ఉన్న చిత్రాలతో ముద్రించారు. ప్రతిరోజూ, రథయాత్ర ప్రోగ్రెస్ గురించి వార్తాపత్రికలు అందరినీ మరింత ఉత్తేజపరిచాయి.
దీనికి సరిగ్గా ఒక సంవత్సరం ముందు , జూన్ 1989లో, బీజేపీ పాలంపూర్ సమావేశంలో, రామమందిరాన్ని తన ఎజెండాగా ప్రకటించింది , రథయాత్ర దాని మొదటి ఆన్-గ్రౌండ్ మానిఫెస్టాటిన్ . అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలనే విహెచ్పి డిమాండ్‌ను రాజకీయ సమస్యగా బిజెపి చేపట్టాలని సదస్సులో తీర్మానించారు.
సెప్టెంబర్ 25, 1990న గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం వద్ద రథయాత్ర ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల మీదుగా 10,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని దాటి, రథం చివరికి అయోధ్యకు చేరుకుంటుంది, అక్కడ కరసేవకులు మసీదును స్వాధీనం చేసుకుని రామ మందిరాన్ని నిర్మించడం ప్రారంభిస్తారు. రోజుకు దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించాలనే లక్ష్యంతో అద్వానీ బొంబాయి వైపు పయనమయ్యారు అని ఆ రోజు ఆ బ్లాక్ బోర్డు చూపించింది…
అద్వానీ, కళ్యాణ్ సింగ్ వంటి నాయకులు సుప్రసిద్ధులైనప్పటికీ, దిగ్విజయ్ నాథ్, అభిరామ్ దాస్ వంటి వారు అనేక విధాలుగా ఉద్యమానికి సహకరించి, చివరికి రామమందిర నిర్మాణానికి దారితీసిన ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఏమైనప్పటికీ, సాధువుల నుండి, న్యాయవాదుల నుండి, రాజకీయ నాయకుల నుండి, సామాన్య ప్రజల వరకు, ఈ ఉద్యమం విభిన్న వ్యక్తులచే నిర్మించబడింది, నడిపించబడింది మరియు నిర్వహించబడింది. నేటికి సాధించగలిగింది .
ఉద్యమంలో అగ్రనాయకులుగా అంతగా పేరులేని వ్యక్తులుగా అనుబంధించబడిన కొందరు వ్యక్తులు:
గోరఖ్‌నాథ్ మఠ్ మహంత్ దిగ్విజయ్ నాథ్ గారు ,
బీహార్ నుండి 1930 లో వచ్చిన మహంత్ అభిరాం దాస్ గారు…ఈయన 1949 డిసెంబర్ లో చిన్న రమ్ లల్లా విగ్రహం పెట్టిన మల్లయోధుడు, 1949లో ఫైజాబాద్ సిటీ మెజిస్ట్రేట్ గురుదత్ సింగ్ గారు,
1949లో ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కేకే నాయర్ గారు,
1949లో లాయర్ అండ్ హిందూ మహాసభ అయోధ్య సెక్రటరీ గోపాల్ సింగ్ విశారద గారు,
నిర్మోహి అఖారా అధిపతి భాస్కర్ దాస్ గారు ,
గోరఖ్‌నాథ్ మఠానికి చెందిన మహంత్ దిగ్విజయ్ వారసులు మహంత్ అవైద్యనాథ్ గారు,
అయోధ్య పురాణం కాదని రుజువు చేసిన మొదటి పురావస్తు శాస్త్రవేత్త బి.బి.లాల్ గారు
బాబ్రీ కూల్చివేతకు రెండేళ్ళ ముందు మరణించిన ఒక ఆధ్యాత్మిక యోగి దేవ్రహ బాబా,
రామజన్మభూమి న్యాస్ అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ దాస్ గారు ,
1984లో అఖిల భారతీయ సంత్ స్మితిని స్థాపించిన స్వామి వామదేవ్, ఫైజాబాద్ లో న్యాయవాదిగా ఉంటూ జర్నలిస్టుగా ఒక కథను పరిశోధిస్తున్నప్పుడు అయోధ్య వివాదంపై ఆసక్తి కలిగిన ఉమేష్ చంద్ర పాండే గారు ,
అలహాబాద్ హైకోర్టులో రిటైర్డ్ న్యాయమూర్తి డియోకి నందన్ అగర్వాల్ గారు ,
నార్త్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ రీజినల్ డైరెక్టర్ KK ముహమ్మద్ గారు ,
కరసేవకులు , అన్నదమ్ములు అయిన రామ్ మరియు శరద్ కొఠారి , రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయవాది కె పరాశరన్ గారు..
అందరికీ శిరస్సు వంచి సాష్టాంగ నమస్సులు..తత