డైరెక్టర్ మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ది రాజా సాబ్. హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారనే వార్తే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తుంది. దానికి తోడు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని, వారు ముగ్గురితో ప్రభాస్ ఓ మాస్ సాంగ్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి.
రిద్ది కుమార్ లవర్ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించినా, తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ రాధే శ్యామ్ లో చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ తో నటించబోతుంది. మరోవైపు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తొలిసారిగా ప్రభాస్ సరసన నటించబోతున్నారు. కాగా వీరు ముగ్గురూ నటించే పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని మారుతి ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను తెరకెక్కిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు