సంజయ్ లీలా భన్సాలి.. తనదైన శైలిలో, సామాన్య కథలను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించగల సమర్థులు.. ఆయన మొట్టమొదటి సారిగా తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ హీరామండి – ది డైమండ్ బజార్ పై సినీ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.. కాగా నెట్ ఫ్లిక్స్ వేదికగా మే 1 నుండి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఏకంగా 14 భాషల్లోకి అందుబాటులో ఉండటం విశేషం..
నిజానికి మే 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుందని ప్రచారం జరిగినా ఈరోజు మధ్యాహ్నం వరకూ అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుందా లేదా అనే సందేహం చాలామందిలో చెలరేగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం నుండి అందుబాటులోకి రావడటంతో ఆ రూమర్లకి చెక్ పడింది. ఈ సిరీస్ అనౌన్స్ చేసిన నాటి నుంచి ప్రమోషన్ల కారణంగా, సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేస్తున్న మొదటి సిరీస్ కావడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ ఈ సిరీస్ విడుదల కాకపోవడంతో సిరీస్ రిలీజ్ పై సందేహాలు ఏర్పడ్డాయి. కానీ ఈరోజు మధ్యాహ్నానికి అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా ఈ సిరీస్ లో సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, రిచా ఛద్ధా, షర్మిన్ సెగల్, సంజీదా షైక్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ ఇండియాలోని ప్రధాన భాషల సహా ఇంగ్లీష్, అరబిక్, పోర్చుగీస్, ఫ్రెంచ్, జర్మన్, మలయ్, పోలిష్, స్పానిష్, థాయ్ లాంటి మొత్తం 14 భాషల్లో స్ట్రీమ్ అవుతుంది.