టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ లేటెస్ట్ గా నటించిన చిత్రం ప్రసన్న వదనం.. ఈ సినిమా నేటి శుక్రవారం అనగా మే 3 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ పొందిన ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తుంది.
సుహాస్ కలర్ ఫోటో, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హిట్ 2, ఫ్యా మిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్ అనంతరం అర్జున్ వైకే దర్శకత్వంలో ప్రసన్న వదనంలో నటించాడు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా జెఎస్ మణికంఠ మరియు టిఆర్ ప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడ్డాయి. కాగా ప్రస్తుతం ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ఆహా దక్కించుకున్నట్లు తెలుస్తుంది. గతంలో సుహాస్ నటించిన కలర్ ఫోటో, ఫామిలీ డ్రామా ఓటిటి వేదికగా విడుదల అయ్యాయి. ఇప్పుడు తాజాగా ప్రసన్న వదనం థియేటర్లలో రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.