ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపోటములపై రాజకీయవర్గాలకే కాకుండా ఇటు సామాన్య ప్రజల్లో కూడా తీవ్రమైన చర్చే నడుస్తుంది . రాష్ట్రాన్ని ఒక పక్క నవరత్నాల పేరిట సంక్షేమం , మరో పక్క పోర్టులు , పరిశ్రమలు, మెడికల్ కాలేజీలు , నాడు నేడు స్కూల్స్ , ఆర్బీకేలు , విలేజ్ క్లినిక్స్ , సచివాలయాలు అంటూ అభివృద్దిని సైతం చేసి చూపుతున్న జగన్ గారికే తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయని కొంతమంది నుండి వస్తున్న వాదనైతే, మరికొంతమంది మాత్రం పొత్తులు కలుపుకుని పత్రికలు టీవీలు, సోషల్ మీడీయా మాటున జగన్ పై వ్యతిరేక ప్రచారం చేస్తున్న చంద్రబాబు మ్యానుపులేషన్ రాజకీయాలకి ప్రజలు బోల్తా పడే అవకాశాలు సైతం లేకపోలేదని మరికొందరి వాదనగా వినిపిస్తుంది.
ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఓటర్ల పరంగా చూస్తే గెలుపోటములని నిర్ణయించేది మహిళామణులే అని లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 మంది ఓటర్లు ఉంటే అందులో పురుషుల ఓట్లు 2,00,09,275 మంది. మహిళల ఓట్లు 2,07,27,065 ఉన్నట్లు ఎన్నికల కమీషన్ తేల్చిన లెక్కలు. ఈ లెక్క ప్రకారం చూస్తే రాష్ట్రంలో పురుషుల ఓట్ల కన్నా కూడా మహిళా ఓటర్లు 7,17,790 మంది అధికంగా ఉంటూ నియొజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపోటములని నిర్ణయించే స్థాయిలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే జగన్ గారి పాలనలో వివిధ సంక్షేమ పధకాల ద్వారా గతంలో ఏ పాలకుడు చేయని విధంగా ఎలాంటి అవినీతికి తావులేకుండా రాష్ట్రంలోని మహిళామణులకి ఇప్పటికే డీబీటీ ద్వారా 1,81,460.04 కోట్ల రూపాయలు అలాగే నాన్ డీబీటీ ద్వార 85,312.51 కోట్లు వెరసి మొత్తంగా 2,66,772.55 కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లోకి వేసి వారికి ఆర్ధిక స్వాలంభన కల్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే డ్వాక్రా రుణమాఫీ చేస్తాం అంటూ మహిళలకి హామీ ఇచ్చి పూర్తిగా మోసం చేశారనే వాధన ఉంది. ఈ నేపధ్యంలో మహిళా ఓట్లరు మోసం చేసిన చంద్రబాబుని నమ్మే స్థితిలో లేరని జగన్ గారి సంక్షేమ ద్వారనే పూర్తిగా ఆర్ధిక భరోసాతో ఉన్నారని కావున వారు మరోసారి జగన్ కే పట్టం కట్టేందుకు సిద్దంగా ఉనట్టు ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించిన అనేక జాతీయ సంస్థల సర్వేలు చెబుతున్నాయి. ఈ వాదనల్లో ఏది వాస్తవమో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.